13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..

Date:

Cigarette Prices Hike: సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ (ITC) కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ల ధరలను మరోసారి పెంచింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.10 పెంచడంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో సిగరెట్ కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో 4% వరకు లాభపడ్డాయి. పెరుగుతున్న పన్నుల భారం, చట్టబద్ధమైన సిగరెట్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో ఈ ధరల పెంపు చేయాల్సి వచ్చింది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 60 నుంచి 70 మి.మీ. పొడవు ఉండే గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ టిప్డ్ (RSFT) సిగరెట్ల 10 ప్యాకెట్ ధరను ఐటీసీ రూ.125 నుంచి రూ.135కు పెంచింది. అంటే సుమారు 8% ధర పెరిగింది. కొత్త ధరలతో కూడిన స్టాక్‌లు నవంబర్ నాలుగో వారం నాటికి గోదాములకు చేరుకోనున్నాయి. 2026లో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం బ్రాండ్‌పై ఐటీసీ ధరలు పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్‌లో ఒక్కో ప్యాకెట్ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచింది. తాజాగా మరో రూ.10 పెంచడంతో ఈ ఏడాది ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం పెరుగుదల సుమారు 17.4 శాతానికి చేరింది.

ధరల పెంపు వార్తలతో గురువారం ట్రేడింగ్‌లో ఐటీసీ షేరు గరిష్ఠంగా 1.61 శాతం పెరిగి రూ.289.10కు చేరుకుంది. మరోవైపు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు 3.52% లాభంతో రూ.1,889 స్థాయిని తాకింది. సిగరెట్లపై పన్నులు గణనీయంగా పెరగడంతో ఐటీసీ తన ధరల విధానాన్ని సమీక్షిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. చట్టబద్ధంగా విక్రయించే సిగరెట్ల ధరలకు, అక్రమంగా విక్రయించే సిగరెట్ల ధరలకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. దీంతో చట్టబద్ధమైన మార్కెట్‌లో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి కొనసాగుతోంది.

వినియోగదారులు తక్కువ ధరకు లభించే అక్రమ సిగరెట్ల వైపు మళ్లకుండా ఉండేందుకు, అదే సమయంలో వ్యాపార లాభదాయకతను కాపాడుకునేందుకు ఆచితూచి ధరలను సవరిస్తున్నట్లు ఐటీసీ తెలిపింది. ఈ ప్రభావం కంపెనీ ఆర్థిక ఫలితాల్లోనూ కనిపించింది. ఐటీసీ సిగరెట్ వ్యాపారంలో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. కంపెనీ సిగరెట్ ఆదాయంలో ఈ విభాగం వాటా సుమారు 50 శాతం వరకు ఉంటుంది. ఐటీసీ మొత్తం లాభదాయకతలోనూ సిగరెట్ వ్యాపారం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలో లాభాల మార్జిన్లు 70% వరకు ఉంటాయని అంచనా.

పెరుగుతున్న పన్నుల భారం మధ్య లాభాలను కాపాడుకోవడంతో పాటు వినియోగదారులపై ధరల ప్రభావాన్ని పరిమితం చేయడం ఐటీసీకి సవాలుగా మారింది. మరోవైపు విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న సిగరెట్లతో పోటీని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త వేరియంట్లు, ట్రేడ్‌మార్క్‌లతో తన సిగరెట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది. దేశీయ మార్కెట్‌లో పన్నుల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ సిగరెట్ల వ్యాపారం పెరుగుతోందని, ఇలాంటి సరుకుల స్వాధీనం ఘటనలు కూడా ఎక్కువయ్యాయని ఐటీసీ పేర్కొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!

Qualcomm Layoffs: టెక్ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. చిన్న కంపెనీల...

Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14వ తేదీని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ అధికారికంగా...

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తాన్‌తో వాణిజ్యంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ...

AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో...