23
June, 2026

A News 365Times Venture

23
Tuesday
June, 2026

A News 365Times Venture

CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్‌గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!

Date:

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు సాయికృష్ణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడంటూ అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లేఖ అందజేయగా.. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి చంపిన సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చినట్లు విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన కుమారుడిని చూపించకుండా సీఐ నాగరాజు తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. తన కుమారుడి గురించి అడిగినప్పుడు ‘నీ కొడుకుని చంపేస్తాను.. ఫోటోకు దండ సిద్ధం చేసుకో’ అంటూ హెచ్చరించాడని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణను కొడుతున్నప్పుడు అతడి అరుపులు వినిపించాయని, అనంతరం పై అంతస్తుకు వెళ్లి కుమారుడిని చూసినట్లు కూడా విజయలక్ష్మి వివరించారు. అంతేకాకుండా స్టేషన్‌లోనే తన కుమారుడికి తీవ్ర చిత్రహింసలు పెట్టి హత్య చేసి, ఆ తర్వాత మృతదేహం ఆనవాళ్లు లేకుండా కాల్చివేసినట్లు తనకు సమాచారం అందిందని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం కోసం బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు.

సీఐ నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ నెల 19న నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందజేయగా.. కమిషనర్ ఎండార్స్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయికృష్ణ మృతి వ్యవహారం ప్రస్తుతం విజయవాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

GEN Z పిల్లలు Vaibhav Sooryavanshiని చూసి నేర్చుకోండి.. వైభవ్పై ప్రధాని మోడీ ప్రశంసలు.!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్...

NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.

NEET Exam: రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్...

Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జేజేలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..

శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ...

Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి

Rahul Gandhi:  అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ...