17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!

Date:

BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫైబర్ ఫ్రీడం ప్లాన్’ పేరుతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒకే కనెక్షన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. మరోవైపు దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. 26,300కు పైగా అదనపు 4G BTS సైట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. వీటి ద్వారా మరిన్ని పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు 4G సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

200 Mbps స్పీడ్:

ఫైబర్ ఫ్రీడం ప్లాన్‌ను ప్రత్యేక లాంచ్ ధరగా నెలకు రూ.1,111కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లో గరిష్ఠంగా 200 Mbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా నెలకు ఏకంగా 5,000GB డేటాను అందిస్తోంది. ఇంటర్నెట్‌తో పాటు 25కు పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఏయే ఓటీటీ సేవలను అందిస్తున్నారనే వివరాలను BSNL వెల్లడించలేదు. అలాగే రూ.1,111 ప్రత్యేక లాంచ్ ధర ఎంతకాలం అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కూడా కంపెనీ స్పష్టం చేయలేదు.

సెల్ఫ్‌కేర్ యాప్:

ఫైబర్ ఫ్రీడం ప్లాన్‌తో పాటు బిఎస్ఎన్ఎల్ తన సెల్ఫ్‌కేర్ మొబైల్ అప్లికేషన్‌ను కూడా పూర్తిగా అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ‘BSNL Selfcare New’గా రీబ్రాండ్ చేసింది. ఈ యాప్ ద్వారా ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, పోస్ట్‌పెయిడ్‌, ల్యాండ్‌లైన్ బిల్లుల చెల్లింపు, ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్టేటస్ ట్రాకింగ్, డీఎన్‌డీ మేనేజ్‌మెంట్, పేమెంట్ హిస్టరీ వంటి సేవలను పొందవచ్చు. అంతేకాకుండా ఫైబర్ కనెక్షన్ బుకింగ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంది.

AI చాట్‌బాట్‌:

కొత్త BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌లో ఏఐ చాట్‌బాట్ సపోర్ట్, వాయిస్ సెర్చ్, ఒకే యాప్‌లో అనేక ఖాతాలను నిర్వహించే సదుపాయం కూడా అందిస్తోంది. దీంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన పలు సేవలను ఒకే చోట నుంచి నిర్వహించుకోవచ్చు. అదే యాప్‌లో BSNL ఎంటర్టైన్మెంట్ టీవీ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా మొబైల్‌లో లైవ్ టీవీ ఛానళ్లతో పాటు ఆన్-డిమాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్‌-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!

AP Assembly 2026 Four Day Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై...

CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా...