29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..

Date:

Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లా్ల్లో భారీ నష్టమే జరిగింది.. అయితే పంట నష్టం, రైతులకు నష్ట పరిహారంతో పాటు.. ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకంగా తీసుకొచ్చిందని అన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాల్లో చేరారని, ఎలాంటి సందేహాలకు తావులేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇలాంటి సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది సచివాలయ ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్లగా, వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను తెలుసుకునే ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించి ఉద్యోగుల ఆందోళనను అణిచివేయాలని చూడటం సరికాదని అన్నారు.

ఉత్తరాంధ్రలో తుఫాన్‌ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని బొత్స పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించిందని, ఆ విధంగా రైతులను ఆదుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. తిత్లీ తుఫాన్‌ సమయంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా రైతులు భారీగా నష్టపోయారని, కేవలం రూ.వెయ్యి, రూ.10 వేలతో సమస్య పరిష్కారం కాదని అన్నారు. పంట నష్టంతో పాటు రైతులు జీవనాధారాన్ని కూడా కోల్పోయారని బొత్స తెలిపారు. నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. ఇటీవల భారీ వర్షాలు, తుఫాన్‌ కారణంగా పంట నష్టం జరిగిందని, రైతులకు తగిన పరిహారం అందించాలని బొత్స ఇప్పటికే డిమాండ్ చేసినట్లు ఆయన పార్టీ కూడా పేర్కొంది.

రాష్ట్రంలో పాలన పోలీస్‌ స్టేషన్లకే పరిమితమైందని బొత్స విమర్శించారు. అన్నీ పోలీస్‌ స్టేషన్లలోనే సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని, చివరకు గ్రామ రాజకీయాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయకూడదనే అంశాల్లో కూడా పోలీసుల జోక్యం ఉంటోందని ఆరోపించారు. పోటీ చేయాలనుకునే వారిని భయపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. డీజీపీ ఏం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఎప్పటికీ ఒకే వ్యక్తి అధికారంలో ఉండరని, అధికారంలో మార్పులు సహజమని వ్యాఖ్యానించారు. పోలీసులు బ్రిటిష్‌ పాలనను తలపించేలా వ్యవహరించవద్దని, ప్రజా ఆగ్రహానికి గురికావద్దని కోరారు. ఉద్యోగుల ఆందోళనలో అసాంఘిక శక్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో బొత్స స్పందించారు. పోలీసులు ఇప్పటికే వీడియోలు తీశారని, నిజంగా అలాంటి వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక శక్తుల పేరుతో మొత్తం ఉద్యోగుల ఆందోళనను తప్పుబట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు బొత్స సత్యనారాయణ..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్

OTR: రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తీరు ఒకలా ఉంటే… ఉమ్మడి...

Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్...

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్‌, సరస్‌ మేళాకు భారీ ఏర్పాట్లు

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు...

Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..

ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ...