17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకం

Date:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక మార్పు చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత బీఎం సందీప్‌ను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్‌కు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

ఎవరీ బీఎం సందీప్?

కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీఎం సందీప్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ పీసీసీలకు సహ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో తనదైన ముద్ర వేశారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నూతన ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్‌కు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం...

Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!

Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో...

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో...

BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!

BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘‘భారత్ సమ్మిట్’’ వివాదానికి...