2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు

Date:

Bangladesh:బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక నినాదాలు వినిపించాయో, మరోసారి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ సంక్షోభం, ఇంధన, గ్యాస్ కొరతపై ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా్ర్థి నేతలు నిరసనలకు దిగారు. శుక్రవారం ఢాకాలో నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నిర్వహించి భారీ ర్యాలీలో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈ ఎన్సీపీనే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, ఆ పార్టీ ఢాకాలోని నేషనల్ మ్యూజియం ఎదుట భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దేశంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ హోం, ఇంధన శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ‘‘ఢిల్లీనా.. ఢాకానా.?’’ అని నినదించగా, అక్కడ ఉన్న వారు ‘‘ఢాకా.. ఢాకా..’’ అంటూ ప్రతిస్పందించారు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారత వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా చేసుకుని అక్కడి విద్యార్థి నేతల పార్టీ ఎన్సీపీ ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో భారత ఈశాన్య రాష్ట్రాలను విడదీస్తామాని ఎన్సీపీ ఎంపీ హస్నత్ అబ్దుల్లా హెచ్చరించారు. తాజాగా జరిగిన ర్యాలీలో ఇతను కూడా పాల్గొన్నాడు.

భారత్‌పై కుట్రల ఆరోపణలు..

భారత్‌ బంగ్లాదేశ్‌పై కుట్రలకు పాల్పడుతోందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా భారత్ కుట్రల నుంచి దేశాన్ని రక్షించలేకపోతోందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. సరిహద్దుల్లో హత్యలు జరుగుతున్నాయని, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు వేధింపులకు గురవుతున్నారని ఎన్సీపీ నేత నహిద్ ఇస్లాం అన్నారు. ఢిల్లీలో మసీదులను కూల్చే ప్రణాళికలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవు.

ఇదే కాకుండా గంగా నది ఒప్పందాన్ని కూడా ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌కు న్యాయమైన వాటా దక్కేలా ఈ ఒప్పందాన్ని తిరిగి సవరించకపోతే మరోసారి ప్రజలు వీధుల్లోకి వస్తారని తారిఖ్ రెహ్మన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత్-బంగ్లా మధ్య కుదిరిన 30 ఏళ్ల గంగా జలాల ఒప్పందం ఈ డిసెంబర్‌తో ముగియనుంది. డిసెంబర్ 12లోగా కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయాలని బంగ్లాదేశ్ జలవనరుల మంత్రి కోరుతున్నారు.

షేక్ హసీనా తర్వాత పెరిగిన భారత వ్యతిరేకత..

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆమె భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత వ్యతిరేక పెరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ వ్యతిరేకతను పెంచిపోషించారు. ఇదే సమయంలో యూనస్ మతోన్మాద సంస్థ జమాతే ఇస్లామీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు ఆ పార్టీ నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేశారు. దీంతో వీరంతా బంగ్లాలో రాడికల్ ఇస్లాం భావజాలాన్ని పెంచిపోషించారు. ఇప్పుడు జమాతే ఇస్లామీ బంగ్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..

ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం...

CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం

దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు , మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఓటు...

Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత...

Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.

Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)...