30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత!

Date:

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రవీణ్ పోలీసు బృందంతో కలిసి భవన్ లోనికి వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం బాల్క సుమాన్ మీడియాతో మాట్లాడారు. “ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల పాలనలో వారు ఇచ్చిన హామీలపై గట్టిగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారు. 2009 నుంచి 2014 వరకు నన్ను టార్గెట్ చేసి జైళ్లలో ఉంచారు. గతంలో 226 కేసు లు పెట్టారు. ఆ రికార్డు బద్దలు కొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. మొన్న క్యాతన్‌పల్లిలో కూడా నన్ను అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచారు. వాళ్ళ కడుపు మంట చల్లారలేదు ఏమో? మళ్ళీ నా మీద కేసులు పెట్టారు. ఈ అరెస్టులు కేసులు అన్ని మా లీగల్ టీమ్ చూసుకుంటుంది. నేను పారిపోయాను అని కొన్ని ఛానెల్స్ వేస్తున్నాయి. నేను ఎక్కడికి పారిపోలేదు. తెలంగాణ భవన్ లోనే ఉన్నాను. అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తుంది.” అని పేర్కొన్నారు.

ఇక, ఈ నెల 26వ తారీఖున తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై 27వ తేదీ ఉదయం సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 27వ తేదీ నుంచి మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లోనే బాల్క సుమన్ ఉంటున్నారు. తెలంగాణ భవన్ బయట మూడు రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపుకాస్తున్నారు. ఈరోజు సుమన్ అరెస్ట్ చేసేందుకు ఏసీపీ, పోలీసులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఇంతలో సుమన్ అరెస్ట్ అయ్యారనే వదంతులు వ్యాప్తించాయి. తాను అరెస్ట్ కాలేదని.. ఇక్కడే ఉన్నానని సుమన్ తెలిపారు. అరెస్టు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఇంతలో తెలంగాణ భవన్‌కు సుమన్ తరఫు అడ్వకేట్ చేరుకున్నారు. “ముందస్తు బెయిల్ మూవ్ చేశాం.. అది తెలిసే పోలీసులు కావాలని హంగామా చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే.. పెట్టాల్సిన కేసులు పెట్టారు. డ్యామేజ్ చేద్దాం అని మాత్రమే అన్నారు సుమన్. ఆ కేసులు వర్తించవు. లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. విచారణకి సహకరిస్తాం అని చెప్పాం.” అని సుమన్ అడ్వకేట్ తెలిపారు. అడ్వకేట్ భవన్‌లోకి వెళ్లిన కొద్ది సమయానికే పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!

Airtel: మొబైల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ టెల్...

Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!

Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా...

Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్

Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్...

Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్

Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య...