30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!

Date:

Airtel: మొబైల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ టెల్ (Airtel) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ లను అందిస్తోంది. ప్రీపెయిడ్ లో భాగంగా ఉన్న రూ.469 ప్లాన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రూ.500 లోపే 84 రోజుల వ్యాలిడిటీ అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ముఖ్యంగా ఎయిర్ టెల్ ను సెకండరీ SIM‌ గా ఉపయోగించే వారికి మంచి ఎంపికగా మారింది.

ఏంటి రూ.469 ప్లాన్‌?
ఈ ప్లాన్‌తో వినియోగదారులకు మొత్తం 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వీటికి తోడు 900 వరకు ఉచిత SMSలు అందిస్తారు. బ్యాంకింగ్ OTPలు లేదా సాధారణ మెసేజ్‌ల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. పూర్తిగా కాలింగ్, సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికే రూపొందించిన ప్లాన్ ఇది. అవసరమైతే వినియోగదారులు విడిగా డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఈ ప్లాన్‌తో ఏడాది పాటు ఉచిత Adobe ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇంకా హలో ట్యూన్స్, స్పామ్ కాల్స్ నుంచి రక్షణ కలిగించే స్పామ్ ప్రొటెక్షన్ నెట్‌వర్క్ సదుపాయం కూడా ఉంటుంది.

రూ.548 ప్లాన్‌:
కాలింగ్‌తో పాటు కొంత మొబైల్ డేటా కూడా కావాలనుకునే వారికి రూ.548 ప్లాన్‌ను అందిస్తోంది ఎయిర్ టెల్. ఈ ప్లాన్‌లో కూడా 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ రోమింగ్, 900 SMSలు లభిస్తాయి. వీటితో పాటు 84 రోజులకు గాను మొత్తం 7GB హైస్పీడ్ డేటా అందుతుంది. భారీగా డేటా ఉపయోగించని వారు, అప్పుడప్పుడు మెసేజింగ్, UPI పేమెంట్స్ లేదా లైట్ బ్రౌజింగ్ చేసే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. ఈ ప్లాన్‌లో కూడా Adobe ఎక్స్ప్రెస్ ప్రీమియం సభ్యత్వం ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది.

డ్యూయల్-SIM మొబైల్ ఉపయోగించే వారు లేదా బ్యాకప్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇలాంటి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లు చాలా ఉపయోగపడుతున్నాయి. తరచూ రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. కాల్స్, OTPలు, బ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ వంటి కంపెనీలు ఇప్పుడు వాయిస్-సెంట్రిక్ ప్లాన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. రోజువారీ భారీ డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్‌లు అందించాలన్న TRAI సూచనల తర్వాత ఇలాంటి ఆఫర్లు మరింత పెరుగుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత!

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్...

Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!

Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా...

Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్

Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్...

Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్

Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య...