2
June, 2026

A News 365Times Venture

2
Tuesday
June, 2026

A News 365Times Venture

Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!

Date:

Ashok Dinda: మాజీ భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశోక్ డిండా (Ashok Dinda) రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మోయ్నా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్‌పై 16,241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో కూడా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంగ్రామ్ డోలూయిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ డిండా.. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. భారత తరఫున 13 వన్డేలు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన వన్డేల్లో 12 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టారు. దేశీయ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు కీలక ఆటగాడిగా సేవలందించిన డిండా, ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఐపీఎల్‌లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు సాధించారు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2021 ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన అశోక్ డిండా.. తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కించుకోవడంతో క్రికెట్ మైదానంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్దమయ్యాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా...

Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?

Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు....

Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం...