22
August, 2026

A News 365Times Venture

22
Saturday
August, 2026

A News 365Times Venture

AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..

Date:

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మూడో విడత కింద రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. 1996లో తానే స్వయంగా ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని, 2026లో దీనిని ప్రారంభించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 1995లో ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక రైతులు సాగు, తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చాలనే సంకల్పంతోనే గడచిన రెండేళ్ల కాలంలో ప్రాజెక్టు పనుల కోసం రూ.2,250 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.

గతంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ వేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల రాజ్యంలో 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నామని చెప్పారు.

2019లోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని, గత పాలకుల అలసత్వం, డ్రామాల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు మళ్లించవచ్చని వివరించారు.

దేశంలో నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి గంగా, గోదావరి, కావేరి నదులను అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రధానమైన ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి తీరిపోతుందని, దేశానికే నీటి భద్రత చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాలా మేలు చేస్తామని, మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు ఫౌండేషన్ వేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, అభివృద్ధి మరియు ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వివరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?

Blood Donation: మనం చేసే రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతో...

Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?

Toxic Censor Report: కేజిఎఫ్ వంటి సంచలన విజయం తర్వాత రాకింగ్...

Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..

మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్‌లీ సేకరించిన ప్రముఖ ఫుట్‌బాల్...

Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!

Kitchen Hacks: వంటగదిలో “చాకు” (Knife) ఎంత ముఖ్యమో ఎక్కువగా చెప్పక్కర్లేదు....