3
November, 2026

A News 365Times Venture

3
Tuesday
November, 2026

A News 365Times Venture

AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!

Date:

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీర ప్రాంతం వైపు కదులుతోంది. రానున్న గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 2 నాటికి తీవ్ర తుపానుగా బలపడి, నవంబర్ 3 తెల్లవారుజామున దక్షిణ కోస్తా తీరానికి సమీపానికి చేరుకునే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది.

నవంబర్ 1 తెల్లవారుజామున విడుదల చేసిన ఐఎండీ బులెటిన్ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. నవంబర్ 1 మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా, అదే రోజు అర్ధరాత్రి నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ 2న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నవంబర్ 3 ఉదయం నెల్లూరు నుంచి నరసాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం అప్పుడప్పుడు 120 కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండీ హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ నవంబర్ 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం

OTR: కమలం పార్టీ తెలంగాణ కదనరంగంలోకి దూకినట్టేనా…? మిషన్‌ తెలంగాణ మొదలైపోయినట్టేనా?...

Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!

Rahul Gandhi: ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో కాంగ్రెస్,...

Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెడ్డన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో...

Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!

Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల...