28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?

Date:

Oracle Layoffs: టెక్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నెలలో కొత్త లేఆఫ్స్ చేపట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు ప్రముఖ నివేదిక వెల్లడించింది.

బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. ఒరాకిల్‌లో లేఆఫ్స్‌కు గురయ్యే ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లను కంపెనీ ఆదేశించింది. సెప్టెంబర్ 1న కంపెనీ రెండో ఆర్థిక త్రైమాసికం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే ఈ ఉద్యోగాల కోతలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్య రెండంకెల శాతంలో తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఈ తాజా లేఆఫ్స్‌కు ముందు కూడా ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మేర తగ్గింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. దీంతో ఒరాకిల్‌లో ఉద్యోగుల సంఖ్య సుమారు 1,41,000కు చేరుకుంది.

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో AI సంబంధిత మౌలిక సదుపాయాల కోసం కంపెనీ సుమారు 55.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడులకు మద్దతుగా కంపెనీ సుమారు 43 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 బిలియన్ డాలర్లను డెట్, ఈక్విటీ ద్వారా సమీకరించాలని కూడా ఒరాకిల్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ ఒరాకిల్ క్లౌడ్ వ్యాపారానికి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా AI కంప్యూటింగ్ సామర్థ్యానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీ క్లౌడ్ సేవల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయితే AI మౌలిక సదుపాయాలపై కంపెనీ భారీగా చేస్తున్న ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఒరాకిల్ షేర్లు గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. తాజా ఉద్యోగాల కోతలపై ఒరాకిల్ లేదా కంపెనీ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ లేఆఫ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్

తెలంగాణలో కొత్తగా 41 టూబీ (2B) బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రొహిబిషన్...

Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..

Parvesh Verma Slap Row: ఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో పీడబ్ల్యూడీ...

Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!

భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. కేరళ...

CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?

CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ కేంద్రంగా...