27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..

Date:

CM Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఏకగ్రీవ వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతను చాటిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు సంస్థాగత విధానాలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టమైందని తెలిపారు.

SIR నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవే
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR)కు సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం సమిష్టిగా తీసుకున్నవేనని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. సెప్టెంబర్ 26న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన పూర్తి కమిషన్ సమావేశమై వివరణ ఇచ్చింది. SIR షెడ్యూల్‌కు సంబంధించిన నిర్ణయాలు కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని ఈసీ తెలిపింది.

రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు
ఇక, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం విచారకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే విజయాలను మాత్రమే కాకుండా పరాజయాలను కూడా హుందాగా, వినయంగా స్వీకరించడం అని అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రజల నిర్ణయంగా గౌరవించాలని సూచించారు.

రాజ్యాంగ సంస్థలను గౌరవించడం బాధ్యత
రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం… పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడటం నాయకులందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో సంస్థలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌ (ట్వీట్‌ చేశారు) లో పోస్ట్‌ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..

హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌లో దివంగత మాజీ ప్రధాన మంత్రి, దేశమే గర్వించదగిన...

US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లనుందా?...

IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..

భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి...

OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

OTR: తెలంగాణ బీజేపీ ఫోకస్‌ షిఫ్ట్‌ అవుతోందా? తాత్కాలికంగా కార్యక్షేత్రం మారబోతోందా?...