6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..

Date:

హైదరాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులతో దూకుడు పెంచారు. తాజాగా మెహిదీపట్నంలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహదీపట్నం) కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి తులసిరామ్ సునీత భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ బాధితుడి భవన నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ‘స్పీకింగ్ ఆర్డర్స్’ను పట్టించుకోకుండా, నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు భవిష్యత్తులో వేధించకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత ఏకంగా రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అయితే చివరకు రూ. 6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో మొదటి విడతగా రూ. 4 లక్షలను బాధితుడి నుంచి కార్యాలయంలో స్వీకరిస్తుండగా, సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడుల్లో అధికారులు ఆమె వద్ద నుంచి లంచం సొమ్ముగా తీసుకున్న రూ. 4,00,000 నగదును విజయవంతంగా రికవరీ చేశారు. అలాగే సోదాల సమయంలో లెక్కల్లో చూపని మరో రూ. 2,50,000 అదనపు నగదును కూడా గుర్తించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తన అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అనుచిత లబ్ధి పొందేందుకు యత్నించినందుకుగాను ఆమెపై ఏసీబీ అధికారులు కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేశారు.

ఫిర్యాదుదారుడి భద్రత , గోప్యతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. విచారణ ప్రక్రియను ముగించిన అనంతరం, నిందితురాలు సునీతను నాంపల్లిలోని ప్రత్యేక న్యాయమూర్తి (ఎస్పీఈ అండ్ ఏసీబీ కోర్టు) ఎదుట జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించారు. ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజలు ఎవరైనా నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన ఈ మెరుపు దాడి స్థానిక అధికారుల్లో కలకలం రేపింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందనే కారణంతో 22...

AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ..

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న...

Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!

మోసపోయేవాళ్లుంటే.. మోసం చేసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగాక...

WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..

భారత్, వెస్టిండీస్ మధ్య లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో తొలి టీ20...