27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..

Date:

Bhargavastra: డ్రోన్లు, డ్రోన్ స్వార్మ్(గుంపులుగా వచ్చే డ్రోన్లు)లకు చెక్ పెట్టేలా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ద్వారా ఎదురయ్యే వేగంగా మారుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రూపొందించిన స్వదేశీ ‘భార్గవాస్త్ర’ (Bhargavastra) కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ట్రయల్ టెస్టులు సక్సెస్ అయ్యాయి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన,వాహనంపై అమర్చే విధంగా రూపుదిద్దుకున్న కౌంటర్-స్వార్మ్ డ్రోన్ వ్యవస్థ ఇదే కావడం గమనార్హం.

‘సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL)’ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ పరీక్షలు నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగాయి. శత్రువుల నుంచి గుంపులుగా వచ్చే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు.

రెండు అంచెల రక్షణ..

భార్గవాస్త్ర మొబైల్, మల్లీ లేయర్డర్ రక్షణ వ్యవస్థ. ఇది శత్రు డ్రోన్లు, ఆయుధాలు కలిగిన మానవరహిత వైమానిక వాహనాలు (UAVs), లోయిటరింగ్ మ్యూనిషన్స్, స్వయంచాలక (autonomous) డ్రోన్ స్వార్మ్‌లను ధ్వంసం చేయగలదు. గగనతల ముప్పును అడ్డుకుని నాశనం చేయడాని ఇది అన్ గైడెడ్ రాకెట్లు, ప్రెసిషన్ మైక్రో మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని రెండంచెల డిజైన్ విభిన్న రకాల డ్రోన్ల ముప్పును ఎదుర్కోగలదు.

కమ్యూనికేషన్ సిగ్నళ్లను జామ్ చేయడం లేదా నావిగేషన్ వ్యవస్థలను దెబ్బతీయడం వంటి ఎలక్ట్రానిక్ పద్ధతులపై కాకుండా, శత్రు డ్రోన్లను భౌతికంగా నాశనం చేసే ‘హార్డ్-కిల్’ (hard-kill) విధానాన్ని కలిగి ఉంటుంది. ఎడారులు, మైదానాలు, సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తు వరకు ఉండే ఎత్తైన ప్రాంతాలతో సహా విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు. తద్వారా భారత్‌లోని విభిన్న సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

డ్రోన్లను ఎలా గుర్తిస్తుంది.?

భార్గవాస్త్రలోని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు దీనికి మెదడులా పనిచేస్తుంది. గగనతలం నుంచి వచ్చే ముప్పును గుర్తగించి ట్రాక్ చేయడానికి ఇది అనేక సెన్సార్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగల రాడార్‌తో పాటు ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ (EO/IR) నిఘా వ్యవస్థలు, ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సెన్సార్లను ఇందులో ఉన్నాయి.

డ్రోన్ లేదా డ్రోన్ స్వార్మ్‌ను గుర్తించిన వెంటనే, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆపరేటర్లకు రియల్-టైమ్ ఇమేజ్‌ను ఇస్కతుంది. దీని తర్వాత లాంచర్‌కు టార్గెట్లను కేటాయించి, వచ్చే డ్రోన్లపై తక్షణమే స్పందించేలా చేస్తుంది. పెద్ద సంఖ్యలో దూసుకువచ్చే డ్రోన్ స్వార్మ్‌లను గుర్తిస్తుంది. భారత సాయుధ దళాల ‘కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్ (C4I)’ నెట్‌వర్క్‌లతో అనుసంధానమయ్యేలా దీన్ని రూపొందించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: అత్తారింటి నుంచి అసెంబ్లీకి..! కవిత పోటీపై బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

Off The Record: తెలంగాణ రక్షణసేన చీఫ్.. కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం...

CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?

OTR: వర్గ విభేదాలకు విరామం లేదు.. ఉన్న నేత విషయంలో అసంతృప్తి...

OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం కొత్త...