22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..

Date:

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో పంత్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 3,000 పరుగుల మార్కుకు 52 పరుగుల దూరంలో ఉన్న పంత్, తన ఇన్నింగ్స్‌లో ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలిని కనబరిచాడు.

ఆరంభంలో ప్రమాదకర షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత గేర్ మార్చి న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 బంతుల్లో తన టెస్ట్ కెరీర్‌లో 22వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తర్వాత WTCలో 3,000 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా పంత్ నిలిచాడు.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ ధాటిగా బ్యాటింగ్ చేసి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ కీలక భాగస్వామ్యంతో జట్టును బలమైన స్థితిలో నిలిపారు. పడిక్కల్ 53 పరుగులతో సంయమనంతో ఆడగా, రాహుల్ 290 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

రాహుల్ ఔటైన తర్వాత శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతూ కేవలం 66 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 104వ ఓవర్‌లో నాథన్ స్మిత్ బౌలింగ్‌లో రాహుల్ 136 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం గిల్, పంత్ కలిసి భారత్ స్కోరును 400 పరుగులు దాటించారు. న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించగా, భారత బ్యాటర్లు నిలకడగా రాణించి మ్యాచ్‌పై పట్టు సాధించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..

PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి...

Microwave Cleaning Hacks : ఓవెన్‌లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ

Microwave Cleaning Hacks : వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో...

CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం

గత మూడేళ్లలో తెలంగాణ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులు 68 శాతం...

Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!

Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి....