22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?

Date:

OTR: ఆ మాజీ మంత్రిది అసంతృప్తా…? భయమా…? వైరాగ్యమా…? లేక అసంతృప్తితో కూడిన భయం వల్ల వచ్చిన వైరాగ్యమా? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉండి కూడా…ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎందుకు ప్రకటించారు? ఇప్పటికే కాంప్రమైజ్‌ అయ్యాను. ఇక మీదట ఇంకా రాజీపడాల్సి వస్తుందని భయపడ్డారా? ఎవరా సీనియర్‌ ఎమ్మెల్యే? ఏంటా వైరాగ్యపు వ్యవహారం? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోననే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అందుకు ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉండవచ్చుగానీ… సీనియర్ లీడర్స్‌ నోటి నుంచి అలాంటి మాటలు రావడం ఆసక్తికరంగా మారుతోంది. దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి ఒకరు… రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పి ఆ మధ్య రాజకీయ చర్చకు తెరలేపారు. అది అలా కొనసాగుతుండగానే…. తాజాగా ఆయన బాటలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అదే తరహా ప్రకటన చేశారు. ఆయన చేసిన ఒక్క ప్రకటన ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ సుదర్శన్‌రెడ్డి చేసిన ప్రకటన వెనుకున్న అసలు కారణం ఏంటంటూ ఎంక్వైరీలు పెరిగిపోతున్నాయి. అది వయసు రీత్యా తీసుకున్న నిర్ణయమా? లేక అసంతృప్తిని వెళ్ళగక్కడానికి ఎంచుకున్న మార్గమా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే… రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసి వారసుల్ని బరిలో దింపే పనిలో ఉన్నారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

ఇటీవల బోధన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారాయన. దీంతో… పెద్దాయనకు రాజకీయ వైరాగ్యం వచ్చినట్టు కనిపిస్తోందన్న చర్చలు మొదలయ్యాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నేత ప్రకటనతో బోధన్ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. ఈ సుదర్శనరాగం వెనకున్న సీక్రెట్‌ ఏంటన్న చర్చోప చర్చలు నడుస్తున్నాయి. సీనియర్‌ లీడర్‌గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ రెడ్డి అంత తేలిగ్గా అలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడి ఉండకపోవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది కేవలం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే నిర్ణయమా? లేక రాజకీయ వారసత్వానికి లైన్‌ క్లియర్‌ చేసే ప్లానా అంటూ ఆరా తీస్తున్నారు. ఇదే ఊపులో… ఆయన రాజకీయవారసుడు ఎవరన్న ప్రస్తావన కూడా వస్తోందట ఉమ్మడి జిల్లా రాజకీయవర్గాల్లో. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బోధన్‌ బరిలో దిగిన సీనియర్‌ నేత విజయం సాధించారు. తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవి ఇస్తారని కూడా అప్పట్లో గట్టి ఆశలే పెట్టుకున్నారాయన. ఆ ఛాన్స్‌ దక్కలేదుగానీ… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా క్యాబినెట్ హోదాలో పదవి వచ్చింది. అయితే…ఆ పదవి విషయంలో ఆయన అంత సంతృప్తిగా లేరని, క్యాబినెట్‌ ర్యాంకేగానీ… కేబినెట్‌లో కాదుకదా అంటూ…సన్నిహితుల దగ్గర అన్నట్టు అప్పట్లో చెప్పుకున్నారు.

మరోవైపు జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్నారాయన. ఈ పరిస్థితుల్లో…. బోధన్‌లో జరిగిన చేయూత పింఛన్ల పంపిణీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు.. వయసు అయిపోతోంది.. అయినా మీకోసం తిరుగుతున్నా అంటూ అన్న మాటల చుట్టూ రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. పెద్దాయన చెప్పినట్టు నిజంగానే వయసు కారణమా..? లేక ఆశించిన పదవి దక్కలేదన్న రాజకీయ వైరాగ్యమా? అన్న చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. వయస్సు రీత్యా ఆ ఛాన్స్‌ దక్కలేదన్న ప్రచారం ఉంది. ఆ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నా…. ఇన్నాళ్ళు ఎక్కడా బయటపడనివ్వలేదు. కానీ… ఇప్పుడాయన నోటి నుంచి ఈసారి తప్పుకుంటానన్న మాట రావడంతో… ఫుల్‌ క్లారిటీలో ఉన్నారా? లేక కేబినెట్‌ బెర్త్‌ కోసం ఇంకో ప్రయత్నం చేసి చూద్దామనుకుంటున్నారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట కొందరికి. ఈ పరిస్థితుల్లో… ఒకవేళ నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటే.. సుదర్శన్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరన్న చర్చ సైతం నడుస్తోంది జిల్లాలో. దశాబ్దాలుగా బోధన్ రాజకీయాలను శాసిస్తున్నారాయన. దీంతో.. తర్వాత స్థానికంగా కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయి? ఆయన కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా? లేక నియోజకవర్గంలో పార్టీకి విధేయుడిగా ఉన్న మరో నేతకు అవకాశం దక్కుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నాయి రాజకీయ వర్గాలు. సుదర్శన్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే.. ఆయన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదనే అంచనాలున్నాయి. దీంతో… రిటైర్‌మెంట్‌ గనుక ఖాయమైతే… సుదర్శన్‌రెడ్డి రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుందన్నది బోధన్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..

PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి...

Microwave Cleaning Hacks : ఓవెన్‌లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ

Microwave Cleaning Hacks : వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో...

CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం

గత మూడేళ్లలో తెలంగాణ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులు 68 శాతం...

Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!

Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి....