6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

Telangana Cabinet Decisions: కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!

Date:

Telangana Cabinet Decisions: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నూతన పథకాల అమలు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించి పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు, ఫైర్ సర్వీస్ చట్ట సవరణ, న్యాయస్థానాలకు 136 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2,25,000 ఇందిరమ్మ ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని క్యాబినెట్ సూచించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ప్రజాప్రతినిధులు మమేకం కానున్నారు.

నవంబర్ 7 నుంచి 9 వరకు కొడంగల్‌లో సీఎం పర్యటన
నవంబర్ 7, 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో కార్యక్రమాలకు హాజరవుతారు. నవంబర్ 9న కొడంగల్‌లో భారీ రైతు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారు. నవంబర్ 8న కొడంగల్‌లోని ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించే దీపావళి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజున రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలులో భాగంగా నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల నుంచి దరఖాస్తులు సేకరిస్తాయి. సేకరించిన దరఖాస్తులను తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్, 2003ను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది. నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడంతో పాటు ఆయా వర్గాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఫైర్ సర్వీస్ చట్టంలో సవరణలకు ఆమోదం
తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999లో సవరణలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, ప్రమాదాలకు గల కారణాలను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలను కొత్త నిబంధనల్లో పొందుపరచనున్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు రూపొందించనున్నారు.

భూ సర్వే అప్పీళ్ల గడువు 60 నుంచి 30 రోజులకు కుదింపు
తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్, 1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే, భూ సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ మార్పుతో భూ సర్వేకు సంబంధించిన వివాదాలు, అప్పీళ్ల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

న్యాయస్థానాలకు 136 పోస్టుల మంజూరు
రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు మొత్తం 136 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టు కోసం 56 పోస్టులను మంజూరు చేయనున్నారు. అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు మరో 80 పోస్టులను మంజూరు చేయనున్నారు. దీంతో మొత్తం 136 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. ఇక, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వివిధ శాఖలకు రెవెన్యూ భూములను బదిలీ చేసే అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖ అతిథులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయిలో ‘రైజింగ్ తెలంగాణ’ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రులు, సీనియర్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు బ్యారేజీలకు సంబంధించి పునాదుల సమస్యలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్పిల్‌వే నిర్మాణం కూడా సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల ప్రకారం ప్రస్తుతం ఆ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల మరమ్మతుల విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, అవసరమైన మరమ్మతులు చేపట్టి వాటిని తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు మంత్రి పొంగులేటి..

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Central Government Funds: గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..

Central Government Funds: పండుగల సీజన్‌లో రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర...

AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!

AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి...

KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..

KTR: గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌ను గెలిపించకుండా బీఆర్ఎస్...