4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!

Date:

బియ్యం ధరల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. కృత్రిమ కొరత సృష్టించడం, బస్తాల బరువులో తేడాలు చూపించడం, అసలు ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. అక్టోబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. వీరిలో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 11 పోలీస్ కేసులు నమోదు చేశారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో అధికారులు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను మోసం చేసేందుకు అనుసరిస్తున్న పద్ధతులను గుర్తించారు. ముఖ్యంగా 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా ముద్రించిన లేబుళ్లు వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బియ్యం కంపెనీలు ముద్రించిన అసలు గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ని తొలగించి, ఎక్కువ ధరలతో కొత్త స్టిక్కర్లు అతికిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. దీంతో వినియోగదారులు అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరోవైపు పలువురు వ్యాపారులు కనీస అనుమతులు లేకుండానే బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, కార్మిక శాఖ అనుమతులు, ఆహార భద్రత శాఖకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. కొందరు వ్యాపారులు పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యవహారాన్ని కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.

ఈ అక్రమాలపై అధికారులు కఠిన చర్యలకు దిగారు. సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరాలు రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రజలకు నిత్యావసర సరుకులు సరైన ధరలకు, నాణ్యంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. బియ్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని హెచ్చరించింది. తూకంలో మోసాలు చేయడం, ధరల విషయంలో వినియోగదారులను మభ్యపెట్టడం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?

Railway Track Blast:  రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్...

Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!

Imran Khan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు...

Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే...

Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ...