2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

Date:

అమరావతి వేదికగా కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిపై ఆయన నేతలతో వివరంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల తీరుతెన్నులపై తన అభిప్రాయాలను పంచుకుంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని, చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంతటి స్ఫూర్తి గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కన్పించలేదని ప్రశంసించారు.

కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా బారులు తీరి మరీ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్లు తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తమ ఇబ్బందుల వల్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోవచ్చని, అలాంటి వారిని గుర్తించి వారు సులభంగా వచ్చి ఓటు వేసేలా స్థానిక కేడర్ తగిన సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించకుండా, కేవలం నియమ నిబంధనలకు కట్టుబడి పోలింగ్ శాతం మరింత పెరిగేలా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే రెచ్చగొట్టేలా కుట్ర కోణంలో వ్యవహరించే అవకాశం ఉందని, ఈ విషయంలో కూటమి శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!

Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల...

YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

పులివెందుల నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పోలింగ్ సరళి తీవ్ర...

Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం...

NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!

NASA Swift Telescope: అంతరిక్ష పరిశోధనలో 22 ఏళ్ల పాటు సేవలందించిన...