1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!

Date:

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ దేశంలో సంచలనంగా మారింది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్తున్న వీడియో చిత్రీకరించినట్లు భావిస్తున్న 28 ఏళ్ల సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అంతకుముందు రోజు, అక్టోబర్ 27న తన మోటార్‌సైకిల్ మరమ్మతు చేయించేందుకు ఓ స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. 24 గంటలకు పైగా గడిచిన తర్వాత నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

సౌరీని హత్య చేసి ఉంటారని ఆయన తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, భారత నిఘా సంస్థ RAW‌తో సౌదీకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆయనను సైన్యం నుంచి బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఓ పాడ్‌కాస్ట్‌లో సౌరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భారత నిఘా సంస్థతో సంబంధాల ఆరోపణలు..

షేక్ హసీనా దేశం విడిచి వెళ్తున్న సమయంలో వీడియో చిత్రీకరించిన సౌరీతో పాటు వైమానిక దళ అధికారి లెఫ్టినెంట్ రిఫాత్ అష్రఫీ ఉన్నారని జమాతే ఇస్లామీకి అనుబంధంగా ఉన్న ‘అమర్ దేశ్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ వీడియోపై బంగ్లా ఎయిర్‌ఫోర్స్ విచారణ జరిపి, కొందరు అధికారులు భారత నిఘా సంస్థ RAWతో సంబంధాలున్నట్లు వెల్లడైందని ఆ పత్రిక ఆరోపించింది. ఈ ఆరోపణల్లో సౌదీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీని తర్వాత ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే, ఈ పత్రికా కథనాన్ని బంగ్లాదేశ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ISPR) ఖండించింది. విదేశీ నిఘా సంస్థతో సంబంధాల కారణంగా సౌరీని విధుల్లో నుంచి తొలగించలేదని స్పష్టం చేసింది. వైమానిక దళ చట్టాలు, నిబంధనల ప్రకారం ఇద్దరు అధికారులు వేర్వేరు కారణాలతో పదవీ విరమణ చేయించినట్లు వివరించింది.

పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు..

ఈ ఏడాది జూలైలో ‘స్పీక్ విత్ రషీద్’ అనే పాడ్‌కాస్ట్‌లో సౌరీ పాల్గొన్నారు. షేక్ హసీనా వీడియో తీసినందుకు వైమానిక దళంలో ఉద్యోగం కోల్పోయారా? అనే ప్రశ్నలకు ‘‘అందుకు అవకాశం ఉండొచ్చు’’ అని సమాధానం ఇచ్చారు. తనకు RAWతో సంబంధాలున్నాయంటూ అమర్ దేశ్ ప్రచురించిన కథనం కేవలం ప్రచారంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పాడ్‌కాస్ట్ వైరల్ కావడంతో తన కుమారుడు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసేవాడని సౌరీ తండ్రి ఎనాయెతుల్ కరీం హెలాల్ అన్నారు. తనకు భయంగా ఉందని అప్పుడప్పుడు చెప్పేవాడని, అయితే దీనికి భయపడుతున్నాడో మాత్రం వివరించలేదని వెల్లడించారు.

2025 జూలై 21న మైల్స్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన యుద్ధవిమాన ప్రమాదంపై కూడా సౌరీ ప్రశ్నలు లేవనెత్తారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన చెంగ్డు FT-7BGI శిక్షణ యుద్ధవిమానం పాఠశాల ప్రాంగణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 37 మంది మరణించగా, 170 మందికి పైగా గాయపడ్డారు.

షేక్ హసీనా కుమారుడి స్పందన..

మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్.. సౌరీ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సౌరీపై తప్పుడు ప్రచారం చేసి ఆయన కెరీర్ నాశనం చేశారని అన్నారు. అమర్‌దేశ్ కథనంలో ఆయన జీవితం ఇబ్బందుల్లో పడిందని, వైమానిక దళంలోని కొన్ని అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయని జాయ్ ఆరోపించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్‌గిరి సీపీ హెచ్చరిక..

హైదరాబాద్‌లో మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్...

Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని...

Sara Ali Khan: కేదార్‌నాథ్‌ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..

Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కేదార్‌నాథ్ ఆలయాన్ని...

PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..

PM Modi:  ‘‘ నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు...