8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా

Date:

ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో కీలక పదవి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. బెంగాల్ సినీ, సాంస్కృతిక రంగాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సువేందు అధికారి ఈ ప్రకటన చేశారు. న్యూ టౌన్‌లో ఉత్తమ్ కుమార్ ఫిల్మ్ సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మిథున్ చక్రవర్తి పేరును సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖలో సలహాదారుగా ప్రకటించారు.

ఉత్తమ్ కుమార్ ఫిల్మ్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది. ఇందులో థియేటర్లు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, స్టూడియోలు, ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగాల్ ఒకప్పుడు భారతీయ సినీ రంగంలో కీలక స్థానంలో ఉండేదని సువేందు అధికారి పేర్కొన్నారు.

బీజేపీకి ప్రముఖ ప్రచారకర్తగా మిథున్

మిథున్ చక్రవర్తి భారతీయ సినీ రంగంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందడంతో పాటు బీజేపీ నేతగా కూడా కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పార్టీ తరఫున ఆయన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మిథున్ చక్రవర్తి బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా నియామకంతో మిథున్ చక్రవర్తికి ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల్లో అధికారిక పాత్ర లభించినట్లయింది. బెంగాల్ సినిమా, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు, ప్రాజెక్టుల్లో ఆయన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెర్బియా మాజీ అధ్యక్షుడు...

INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?

INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు...

Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!

ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో...

Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..

భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జింబాబ్వే సిరీస్‌కు...