18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

Rainbow Children’s Hospital: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!

Date:

Rainbow Children’s Hospital: శిశువుల వైద్య సంరక్షణా సేవలలలో దేశంలోనే అగ్రగామి వైద్య సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు నెల్లూరులోని ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మెజారిటీ వాటాను పొందటం ద్వారా నెల్లూరులో తమ శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఈరోజు సగర్వంగా ప్రకటిస్తుంది.

ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రస్తుతం శిశు సంరక్షణ కోసం 70 పడకలు కలిగి ఉన్నాది. రెయిన్‌బో ప్రస్తుతం ప్రైమ్ హాస్పిటల్ నందున్న క్లినికల్ సిబ్బందిని కొనసాగిస్తూ, వైద్య సంరక్షణలో సూపర్-స్పెషాలిటీ సంరక్షణ అందించటమే కాక జిల్లాలోని అన్ని ప్రాంతాల వారి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకు అవసరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం తోపాటు విస్తృతమైన క్లినికల్ సేవలను పటిష్టం చేస్తుంది. 25 ఏళ్ల అనుభవం కలిగిన రెయిన్‌బో హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో నవజాత శిశు మరియు పిల్లల ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ సూపర్-స్పెషాలిటీ క్లినికల్ సేవలు , పీడియాట్రిక్ సర్జరీ, 24/7 అత్యవసర సంరక్షణతో రవాణా సేవలను అందిస్తుంది.

రెయిన్‌బో యొక్క శిశు వైద్య నైపుణ్యం పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, పీడియాట్రిక్ ఆంకాలజీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపటాలజీ, నియోనాటాలజీతో పాటు అధునాతన నియోనాటల్ మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ వంటి అనేక రకాల పీడియాట్రిక్ సూపర్-స్పెషాలిటీలను కలిగి ఉన్నాది. ఈ అధునాతన శిశు వైద్య నైపుణ్యతలు నెల్లూరు పరిసర జిల్లాలలోని కుటుంబాలకు క్రమంగా విస్తరించాలని రెయిన్‌బో ఆశిస్తున్నాది.

రెయిన్‌బో హాస్పిటల్ తన ఉనికిని మరింత విస్తరిస్తూ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ మరియు నెల్లూరులలో హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. ఇది చెన్నై వరకు విస్తరించి, సుమారు ప్రతి 200 కి.మీ ఒక అధునాతన శిశు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అందుబాటులోనికి తెస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా అధునాతన సంరక్షణ, అత్యవసర రవాణా మరియు నిపుణుల సిఫార్సు కొరకు సూపర్-స్పెషాలిటీ కేంద్రాలకు అనుసంధానించే ఒక కీలకమైన వారధిగా నెల్లూరు హాస్పటల్ పనిచేస్తుంది. రెయిన్ బో హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రం కలిగి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సిఆర్ మరియు గౌహతి వంటి నగరాలకు విస్తరించి దేశవ్యాప్తంగా 24 హాస్పిటల్స్ నిర్వహిస్తోంది.

నెల్లూరులో రెయిన్ బో హాస్పిటల్ వైద్య సేవలు ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రమేష్ కంచర్ల.,రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “నెల్లూరు నా సొంత జన్మస్థలమని, నా జిల్లా వారికి అధునాతన రెయిన్‌బో శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అన్నారు. నగరంలోని రోగులకు మరింత మెరుగైన వైద్య సంరక్షణ సేవలు అందిస్తూ, జాతీయ నెట్‌వర్క్‌లో అందిస్తున్న విస్తృతమైన వైద్య నైపుణ్యతల ఉన్నత స్థాయిని ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రైమ్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రైమ్ హాస్పిటల్‌ను రెయిన్‌బో క్లినికల్ వ్యవస్థలో విలీనం చేయటం వలన నెల్లూరు పరిసర ప్రాంత శిశువులు మా కేంద్రాలన్నింటిలో మేము పాటించే ఉత్తమ ఇంటెన్సివ్ కేర్ ప్రమాణాలను పొందగలుగుతారు అన్నారు. స్థానికంగా మంచి పేరున్న ఈ వైద్య విధానాన్ని మరింత బలోపేతం చేయడంపై మేము దృష్టి సారిస్తాము తద్వారా అధునాతన శిశు సంరక్షణ వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు” అన్నారు.

డాక్టర్ ఎ. కళ్యాణ చక్రవర్తి, ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌, నెల్లూరు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మేము ఈ రెయిన్ బో భాగస్వామ్యం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పిల్లలకు అందించుటకు వీలవుతుంది అన్నారు.ఇప్పుడు స్థానికంగా క్లిష్టమైన కేసులను సామర్థ్యవంతంగా నిర్వహించుట సాధ్యమవుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా నెల్లూరు జిల్లాలోని ప్రజలకు ఉత్తమ శిశు వైద్య సేవలు అందించుటకు సంతోషిస్తున్నాము అన్నారు. సంప్రదింపుల కొరకు: మల్లిఖార్జున రావు, ఫోన్ 89786 73555.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్...

SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!

SIR Draft Voter List: తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ...

6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!

POCO M8x 5G: బడ్జెట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో మరో కొత్త...