18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!

Date:

POCO M8x 5G: బడ్జెట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో మరో కొత్త ఫోన్‌ త్వరలో భారత మార్కెట్‌లోకి రానుంది. పోకో నుండి వచ్చిన M8 సిరీస్‌లో కొత్తగా POCO M8x 5Gని తీసుకురానుంది. ఈ ఫోన్‌ భారత్‌లో త్వరలో లాంచ్‌ కానున్నట్లు కంపెనీ ఇప్పటికే పేర్కొంది. అయితే లాంచ్‌ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఫోన్‌ ధర, కీలక స్పెసిఫికేషన్లు తెలిశాయి.

6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే:

POCO M8x 5Gలో 6.9 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. పెద్ద డిస్‌ప్లేతో పాటు అధిక రిఫ్రెష్‌ రేట్‌ ఉండటం వల్ల వీడియోలు చూడటం, సోషల్‌ మీడియా బ్రౌజింగ్‌, గేమింగ్‌ సమయంలో స్క్రోలింగ్‌ స్మూత్‌గా ఉండనుంది.

చిప్‌సెట్‌:

పెర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే.. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి 4GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ జతకానున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. స్టోరేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ సపోర్ట్‌ కూడా ఉండొచ్చని సమాచారం.

భారీ బ్యాటరీ:

ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీనికి 33W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ లభించనుంది. పెద్ద బ్యాటరీ కారణంగా సాధారణ వినియోగంలో మంచి బ్యాటరీ బ్యాకప్‌ అందించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో ఫోన్‌ విడుదల కానున్నట్లు లీక్‌ వెల్లడించింది. ఫోన్‌ కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ టీజర్‌ ప్రకారం.. POCO M8x 5G వెనుక భాగంలో టెక్స్చర్డ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ ఉండొచ్చు. ఎడమవైపు పైభాగంలో స్క్వేర్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్‌ కలర్‌ వేరియంట్‌లో గోల్డ్‌ కలర్‌ యాక్సెంట్స్‌తో ఫోన్‌ కనిపిస్తోంది. పవర్‌, వాల్యూమ్‌ బటన్లు కుడివైపు ఉండనున్నాయి.

ధర:

లీక్‌ ప్రకారం పోకో M8x 5G భారత్‌లో రూ.20,000 లోపు ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. POCO M8 5G బేస్‌ వేరియంట్‌ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ.18,999 ప్రారంభ ధరకు విడుదలైంది. మరోవైపు ఇటీవల లాంచ్‌ అయిన POCO M8 Power 5G 6GB RAM, 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త POCO M8x 5G ధర రూ.20 వేల లోపు ఉంటే బడ్జెట్‌ 5G విభాగంలో రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్...

Rainbow Children’s Hospital: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!

Rainbow Children’s Hospital: శిశువుల వైద్య సంరక్షణా సేవలలలో దేశంలోనే ...

SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!

SIR Draft Voter List: తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ...