5
June, 2026

A News 365Times Venture

5
Friday
June, 2026

A News 365Times Venture

2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

Date:

Petrol, LPG and Milk Prices: గడచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో నిత్యావసరాల ధరల పెరుగుదల ఓ ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కాలంలో ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. దానికి సమాంతరంగా ఇంధనం, వంటగ్యాస్, పాలు వంటి రోజువారీ అవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 2000 వ సంవత్సరం నాటి ధరలను ప్రస్తుత 2026 నాటి ధరలతో పోల్చుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గ్రాఫిక్ నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ గ్రాఫిక్‌లోని వివరాలు దాదాపు నిజమే అయినప్పటికీ, వివిధ నగరాలు, బ్రాండ్లు, రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి దీనిని కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ గ్రాఫిక్ ప్రకారం ధరల వ్యత్యాసాలను గమనిస్తే.. 2000వ సంవత్సరంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 26 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు 2026 నాటికి పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 102 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో అయితే ఏకంగా రూ.105 దాటేసింది. అంటే గతంతో పోలిస్తే పెట్రోల్ ధర దాదాపు 4 రెట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ప్రభుత్వ పన్నులు, రవాణా ఖర్చులు ఎక్కువవ్వడం వంటి కారణాల వల్లే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరిగాయి. ఇక ప్రతి ఇల్లాలు లెక్కలు వేసుకునే వంటగ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ సగటు ధర సుమారు 157 రూపాయలు మాత్రమే. కానీ నేడు 2026లో దాని ధర దాదాపు 912 రూపాయలకు పైగా ఉంది. అంటే వంటగ్యాస్ ధర ఏకంగా 6 రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ, రకరకాల విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ.. ఇప్పటికీ సగటు కుటుంబ బడ్జెట్‌లో ఎల్‌పీజీ సిలిండర్ అనేది ఓ పెద్ద ఖర్చుగా మిగిలిపోయింది.

మరోవైపు దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిత్యావసరమైన పాల ధరలు సైతం ఆహార ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నగరాలు, బ్రాండ్లు, పాలలో ఉండే ఫ్యాట్ కంటెంట్‌ను బట్టి ధరలు మారినప్పటికీ.. గత రెండు దశాబ్దాలుగా పాల సగటు ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలో లీటర్ పాలు కేవలం 14 రూపాయలకే లభించగా, ఇప్పుడు 2026 నాటికి వాటి ధర 72 రూపాయలకు చేరింది. అంటే పాల ధర 5 రెట్లకు పైగా పెరిగింది. పశుగ్రాసం ధరలు పెరగడం, రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు ఎక్కువవ్వడమే ఇందుకు ప్రధాన కారణాలు. అయితే, కేవలం ఈ మూడు వస్తువుల ధరల పెరుగుదలను బట్టే దేశంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పూర్తిగా పెరిగిపోయిందని అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మనుషుల జీవనశైలి అనేది కేవలం ఇంధనం, పాలతోనే ముడిపడి ఉండదు. ఇల్లు, వైద్యం, విద్య, రవాణా సౌకర్యాలు, కరెంట్-నీటి బిల్లులు, వినోదం వంటి అనేక అంశాలు ఇందులో భాగమవుతాయి. పైగా మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ ధరల్లో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ పోలిక కేవలం నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఒక ఉదాహరణ మాత్రమే.. కానీ, దేశ సంపూర్ణ జీవన వ్యయానికి కొలమానం కాదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..

Natural gas: ఇంధన రంగంలో భారత్‌కు ఇది భారీ శుభవార్త. అండమాన్...

Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం

ఆర్ధిక సమస్యలు.. వివాహేతర బంధాలు.. మద్యం.. అదనపు కట్నం.. కారణమేదైనా కావచ్చు…...

Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..

శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు...

India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!

తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు...