28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

144Hz OLED డిస్‌ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్‌స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!

Date:

REDMAGIC 11S Pro Global Launch: గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేక గుర్తింపు పొందిన రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి కొత్తగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రెడ్ మ్యాజిక్ 11S ప్రో (REDMAGIC 11S Pro)ను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ నెల మొదట్లో చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ధరలు ఇవే

REDMAGIC 11S ప్రోలో Snapdragon 8 Elite Gen 5 లీడింగ్ వెర్షన్ ప్రాసెసర్‌ను అందించారు. ఇది 4.74GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో ప్రత్యేక RedCore R4 గేమింగ్ చిప్‌ను కూడా అందించారు. ఇది గేమింగ్ సమయంలో విజువల్స్, ఆడియో, హాప్టిక్స్ మరియు టచ్ రెస్పాన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్‌లో కొత్త AquaCore కూలింగ్ సిస్టంను అందించారు. ఇది 24,000 RPM టర్బో ఫ్యాన్, భారీ 13,116mm² వేపర్ చాంబర్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కనిపించేలా డిజైన్ చేయడం దీని ప్రత్యేకత.

ఈ కొత్త మొబైల్ 6.85 అంగుళాల 1.5K OLED BOE X10 డిస్‌ప్లే ఉండగా.. 144Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్‌లో 7500mAh భారీ బ్యాటరీని అందించారు. 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటంతో చాలా తక్కువ సమయంలో బ్యాటరీ చార్జ్ అవుతుంది. వైర్‌లెస్, రివర్స్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Image (5)

ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉంది. తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీసేందుకు కొత్త ఇమేజింగ్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత REDMAGIC OS 11.5పై పనిచేస్తుంది. ఇంకా అనేక AI ఫీచర్లతో పాటు.. 3.5mm ఆడియో జాక్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, USB 3.2 Gen 2, 520Hz షోల్డర్ ట్రిగర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లు కూడా అందించారు.

REDMAGIC 11S Pro 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర అమెరికాలో 849 డాలర్లు (రూ.81,245)గా నిర్ణయించారు. అలాగే 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 949 డాలర్లు (రూ.90,815)గా ఉంది. ఈ ఫోన్ ఇండియాతో పాటు యూరప్, యూకే, సింగపూర్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా వంటి అనేక దేశాల్లో అందుబాటులోకి రానుంది. కంపెనీ జూన్ 10 నుంచి గ్లోబల్ ఓపెన్ సేల్ ప్రారంభించనుంది. భారత మార్కెట్‌లో కూడా ఈ మొబైల్ విడుదల కానుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trinamool congress: బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

Trinamool congress: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి దూకుడుకు మమతా...

Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్‌ పన్నాగం విఫలం..

ఢిల్లీ, పంజాబ్ లలో భారీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాను...

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?

కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై...

Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”

Motkupalli Narasimhulu: స్వర్గీయ ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,...