18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?

Date:

POVA 8 Pro 5G: భారత మార్కెట్లో పోవా (POVA) నుండి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. “పోవా 8 ప్రో 5G” పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను కంపెనీ ‘Delete Normal’ డిజైన్ కాన్సెప్ట్‌తో రూపొందించింది. ఆకట్టుకునే డిజైన్‌తో పాటు వెనుకవైపు ప్రత్యేకమైన అలైవ్ మాట్రిక్స్ డిస్ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, 144Hz AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, అధునాతన AI ఫీచర్లను ఇందులో అందించారు.

ఈ కొత్త మొబైల్ డిజైన్‌లో ప్రధాన ఆకర్షణగా వెనుకవైపు ఉండే అలైవ్ మాట్రిక్స్ డిస్ప్లే (Alive Matrix Display) నిలుస్తుంది. ఇది డాట్-మ్యాట్రిక్స్ స్క్రీన్ తరహాలో పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ లెవల్, టైమర్లు, ఇన్‌కమింగ్ నోటిఫికేషన్లు, కాలర్ ఐడీ, స్పామ్ డిటెక్షన్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ఫోన్‌ను టేబుల్‌పై స్క్రీన్ కిందివైపు ఉంచినప్పుడు ఈ చిన్న డిస్‌ప్లే డెస్క్ క్లాక్లా కూడా పనిచేస్తుంది. వెనుకవైపు ట్రయాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌తో ఈ ఫోన్‌కు ప్రత్యేకమైన లుక్ అందించారు. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2644 × 1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. గరిష్ఠంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా ఉంది.

పనితీరు కోసం పోవా 8 ప్రో 5Gలో MediaTek Dimensity 7400 Ultimate 4nm ప్రాసెసర్ ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 GPU ఉంది. ఫోన్ 8GB/12GB LPDDR5X RAM, 256GB/512GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ తోపాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పనిచేస్తుంది. రెండు నానో సిమ్‌లు లేదా ఒక నానో సిమ్, మైక్రోSD కార్డ్ ఉపయోగించుకునే హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

Image (3)

కెమెరా విభాగంలో 50MP Sony LYTIA 700C ప్రైమరీ సెన్సార్ ను అందించారు. ఇది f/1.88 అపెర్చర్‌తో పాటు OIS (Optical Image Stabilization)కు సపోర్ట్ చేస్తుంది. దీనికి 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. ముందు కెమెరాతో 4K 30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వెనుక కెమెరా 2K 30fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో AI ఆటో జూమ్, 3D ఫోటో డెప్త్ ఎఫెక్ట్స్, మోషన్ ట్రైల్ ట్రాకింగ్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. ఇవి సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ఫ్రేమ్ చేయడం, డెప్త్ ఎఫెక్ట్స్ అందించడం, కదులుతున్న సబ్జెక్ట్‌లను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి.

POVA 8 Pro 5Gలో ప్రత్యేకమైన AI కాల్ అసిస్టెంట్ ను అందించారు. కంపెనీ ప్రకారం, ఈ సెగ్మెంట్‌లో సాధారణ సెల్యులార్ కాల్స్‌తో పాటు వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేసి, వాటిని ట్రాన్స్‌క్రైబ్ చేసి, ముఖ్యమైన అంశాలను సారాంశంగా అందించే ఫీచర్‌ను ఇందులో అందించారు. ఈ AI ఫీచర్ ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలకు సపోర్ట్ చేస్తుంది. సంభాషణలను యాక్షన్ ఐటమ్స్‌గా మార్చడం, షేర్ చేసిన ఫైళ్లను ఆర్గనైజ్ చేయడం, బిజినెస్ ఉద్దేశాలు, చెల్లింపు స్థితి ఆధారంగా కాంటాక్ట్‌లను వర్గీకరించడం వంటి పనులను కూడా చేయగలదు.

పవర్ బ్యాకప్ కోసం ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ కూడా లభిస్తాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. దీంతో దుమ్ము, నీరు వంటి వాటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా MIL-STD-810 మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో POVA 8 Pro 5G తుండ్రా గ్రీన్, ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి 8GB + 256GB వేరియంట్ రూ.49,999 కాగా, 12GB + 512GB వేరియంట్ రూ.54,999 గా ధరను నిర్ణయించారు. ఈ ఫోన్ ఆగస్టు 21 నుంచి భారత్‌లో అమ్మకాలకు రానుంది. ఫ్లిప్కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, UPI లావాదేవీలకు రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. దీంతో బేస్ వేరియంట్ ప్రభావవంతమైన ధర రూ.46,999కి తగ్గుతుంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం ఉంది. EMIలు నెలకు రూ.2,777 నుంచి ప్రారంభమవుతాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న...

Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని,...

Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్...