10
August, 2026

A News 365Times Venture

10
Monday
August, 2026

A News 365Times Venture

YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!

Date:

ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూ దందాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ కూడా నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. మరోవైపు విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో పాండురంగస్వామి ఆలయ భూమిని కొందరు వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపిస్తూ ఆలయ పరిరక్షణ సమితి ఆందోళనకు సిద్ధం కాగా.. ఆ కార్యక్రమానికి బీజేపీ మద్దతు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు వర్గాల నుంచి ధర్నాలకు అనుమతి కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. అయితే గుంతకల్లు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ప్రస్తుతం సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని సీఐ మహానంది వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, అలాగే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీ్జీఆర్ఎస్) కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణాల వల్ల ధర్నాలకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు.

అయితే పోలీసుల నిర్ణయంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలిరావాలని పిలుపునిస్తూ ఆయన చేసిన వీడియోను వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ధర్నాలోపాల్గొనేందుకు వెళ్తున్న విశ్వేశ్వర రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా వాహనంలో ఎక్కించారు. దాంతో వైసీపీ శ్రేణులు, పోలిసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ

AP PPP Policy 2026: పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంపై పెద్ద...

Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు

Tobacco Farmers: పొగాకు రైతులకు శుభవార్త చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక...

Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్‌?

Nuzvid Love Marriage Twist: ప్రేమించి పోలీస్‌స్టేషన్‌లో వివాహం చేసుకున్న యువకుడు.....

CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ఒక బాధ్యత లేని పార్టీ అని...