30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..

Date:

ఢిల్లీ మహిళల దేశీయ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర ఆవిష్కారమైంది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల దేశీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు 2019-20 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా జట్టు చేసిన 257/2 పరుగుల రికార్డును ఢిల్లీ ఇప్పుడు బద్దలు కొట్టింది.

ఈ భారీ విజయానికి ముఖ్య కారణం ఓపెనర్ తనిషా సింగ్. ఆమె కేవలం 47 బంతుల్లోనే 119 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 38 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, మహిళల టీ20 క్రికెట్‌లో సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన పేరు మీద రాసుకుంది. మరో బ్యాటర్ ప్రియా పునియా కూడా 59 పరుగులతో రాణించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయలేకపోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 ఫోర్లు, 5 సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో పూజ వంక 4 వికెట్లు తీసినప్పటికీ, పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు.

అనంతరం 263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్రిషా గొంగడి 52 బంతుల్లో 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. ప్రణవి చంద్ర 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో సుమితి సోని 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. చివరకు ఢిల్లీ జట్టు 108 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ తనిషా సింగ్ 92 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?

OTR: పంచేసుకున్నారా….? వాళ్ళిద్దరూ షేర్‌ చేసుకున్నారా? బావా బావమరుదులు ఇద్దరూ…. నీకది,...

Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!

Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్...

CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో...

World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!

ప్రతి నెల జీతం వస్తుంది.. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, సరుకులు,...