9
August, 2026

A News 365Times Venture

9
Sunday
August, 2026

A News 365Times Venture

Women’s Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!

Date:

India Women Squad for Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనుండగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ జట్టులో షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్ వంటి ప్రధాన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అయితే స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కు మాత్రం నిరాశ ఎదురైంది. చీలమండ లిగమెంట్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమెకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇదే గాయం కారణంగా ఆమె టీ20 ప్రపంచకప్‌ను కూడా మధ్యలోనే వీడాల్సి వచ్చింది.

శ్రేయాంక పాటిల్ ఆసియా కప్‌కు దూరమైనప్పటికీ.. ఆసియా గేమ్స్ నాటికి పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌కు ఆమె అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ టోర్నీ ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య వరకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు.

స్టార్ ప్లేయర్స్ తో ఉన్న జట్టు.. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. రిజర్వ్ జాబితాలో ప్రతీకా రావల్, ఉమా చేత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సాత్‌ఘరే, మిన్ను మణి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు అదనపు బలం.

మహిళల ఆసియా కప్ 2026కు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందానా (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.

రిజర్వ్ ఆటగాళ్లు:

ప్రతీకా రావల్, ఉమా చేత్రీ (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సయాలి సాత్‌ఘరే, మిన్ను మణి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం

Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్‌తో తుఫానులా దూసుకొచ్చాడు...

AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ...

Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ వేగవంతమైన...

Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..

Russia-india Rail Route: రష్యా నుంచి భారత్ వరకు రైలు మార్గం...