9
August, 2026

A News 365Times Venture

9
Sunday
August, 2026

A News 365Times Venture

Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!

Date:

Will Jacks: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్ 2026’ టోర్నీలో గురువారం (ఆగస్టు 6) నాడు లండన్ స్పిరిట్, ఎంఐ లండన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. లండన్‌ లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఎంఐ లండన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఫలితానికి మించి అందరి దృష్టిని ఆకర్షించింది స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్.

లండన్ స్పిరిట్ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీ షాట్ కొత్తగా.. బంతి సిక్స్‌కు వెళ్లేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ ముందుగా బంతిని బౌండరీ దాటకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ ఒకే చేతితో అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిప్పింది.

ఈ లండన్ డెర్బీ మ్యాచ్‌ను వీక్షించేందుకు 27,721 మంది ప్రేక్షకులు లార్డ్స్‌కు హాజరయ్యారు. ది హండ్రెడ్ గ్రూప్ దశలో ఇది రికార్డు స్థాయి ప్రేక్షకుల హాజరు. జేమీ ఓవర్టన్, జేమ్స్ కోల్స్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతో లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ లండన్‌కు విల్ జాక్స్ ఓపెనర్‌గా వచ్చి 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బ్యాటింగ్ కంటే అతని అద్భుత క్యాచ్‌నే అభిమానులు ఎక్కువగా గుర్తుంచుకున్నారు. చివర్లో సికందర్ రజా కేవలం 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా 6 బంతులు మిగిలి ఉండగానే ఎంఐ లండన్ లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ...

Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ వేగవంతమైన...

Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..

Russia-india Rail Route: రష్యా నుంచి భారత్ వరకు రైలు మార్గం...

Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..

Vaibhav Sooryavanshi: ప్రస్తుత కాలంలో క్రికెట్ అంటే కేవలం మైదానంలో బ్యాట్,...