20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..

Date:

భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీని తాను సొంత సోదరుడిగా భావిస్తానని, కెరీర్‌లోని కష్టకాలంలో ఆయన ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధు, విరాట్‌తో ఉన్న సాన్నిహిత్యం , మైదానంలో ఆయన ప్రదర్శించే పట్టుదలపై ప్రశంసల వర్షం కురిపించారు.

కెరీర్‌లో తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ఒకసారి విరాట్ కోహ్లీని కలిసినట్లు సింధు గుర్తుచేసుకున్నారు. ఏదీ కలసిరావడం లేదని తాను చెప్పినప్పుడు, “ఏదీ ఆలోచించకుండా కేవలం మైదానంలోకి అడుగుపెట్టు. నీవు ఏమిటో, నీ కష్టం ఏమిటో నీకు తెలుసు. ఎలాంటి భయం లేకుండా నీ సహజ సిద్ధమైన ఆటను ఆడు. పోయేదేమీ లేదు, నువ్వేంటో ప్రపంచానికి చూపించు” అని విరాట్ ధైర్యం చెప్పినట్లు తెలిపారు. ఆ ఒక్క మాట తనలో సరికొత్త దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు.

అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారుడి నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం గొప్ప విషయమని, తానేదైనా టోర్నీ గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని విరాట్‌తో పంచుకుంటానని సింధు చెప్పారు. ఎంత సాధించినా విరాట్ ప్రదర్శించే క్రమశిక్షణ, నిబద్ధత ఇతరులకు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు.

ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతక విజేతగా నిలిచిన పీవీ సింధు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌పై 21-7, 21-11 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. మైదానంలో నిలకడగా రాణిస్తూనే, విరాట్ లాంటి అగ్రశ్రేణి అథ్లెట్ల అనుభవాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నానని సింధు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!

Green Chillies at Home: వంటకాలకు పచ్చిమిరపకాయలు చక్కటి కారం, రుచిని...

8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!

Realme P4s 5G: రియల్‌మీ (Realme) నుండి కొత్త P4s 5G...

Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల...

7900mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

Redmi M100: షియోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో కొత్త...