15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Vemula Veeresam: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్.. భారీగా డబ్బులు డిమాండ్

Date:

సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను నియోజకవర్గానికి అంతటికి పంపిస్తామని బెదిరింపులకు దిగారు. భారీగా డబ్బు చేశారు. అందుకు ఎమ్మెల్యే ససేమిరా అనడంతో కేటుగాళ్లు అన్నంత పని చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను పంపించారు. ఆ విషయం కాస్త.. ఎమ్మెల్యేకు కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో ఖంగుతిన్నారు.

అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. తన అనుచరులతో ఉండగా ఒక వీడియో కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగా.. న్యూడ్ కాల్ అని తెలిసి వెంటనే కట్ చేశారు. వెంటనే కాల్ కట్ చేసినా.. అప్పటికే స్ర్కీన్ రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఎమ్మెల్యేకే పంపించి భారీగా నగదు డిమాండ్ చేశారు. అందుకు వేముల వీరేశం స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. వీడియో రికార్డింగ్ కాంగ్రెస్ లీడర్లకు పంపిస్తామని.. ఇక మీ ఇష్టం అంటూ కేటుగాళ్లు హెచ్చరించారు. అన్నట్టుగానే వీడియో రికార్డ్‌ను ఆయన అనుచరులకు పంపించారు. ఖంగుతిన్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకి కూడా ఇటువంటి న్యూడ్ కాల్ వచ్చింది. డబ్బు ఇవ్వకపోతే.. వీడియో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి పోలీసులను ఆశ్రయించారు. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు అదే అనుభవం ఎదురైంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల

Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘దసరా’ వంటి మాసివ్...

Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా

మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్‌ మాత్రమే కాదు.. డేటింగ్ వార్తలతో...

LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..

LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని...