8
May, 2026

A News 365Times Venture

8
Friday
May, 2026

A News 365Times Venture

Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల

Date:

Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘దసరా’ వంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ హిట్ డైరెక్టర్ డైరెక్షన్‌లో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” (The Paradise). పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఈ పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ ALSO: Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్‌ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..

మనం మిస్సవుతున్న ‘మోహన్ బాబు’ను చూపిస్తా..
ఈ వేడుకలో శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “నటుడిగా మోహన్ బాబు గారి అసలైన సామర్థ్యం గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకు పూర్తి అవగాహన లేదు. మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఆ విలక్షణ నటుడిని, ఆయనలోని అసలైన విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నాను. దీని గురించి నేను ఇప్పుడు ఎక్కువగా చెప్పను, టీజర్, ట్రైలర్ల రిలీజ్ అయ్యాకా మీకే అర్థమవుతుంది” అంటూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలోని గాంభీర్యాన్ని, వైలెన్స్‌ను ప్రతిబింబిస్తోంది.

ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుండగా, సోనాలి కుల్కర్ణి, రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని – మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

READ ALSO: Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు...

CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను దేశానికే ఒక ఆదర్శవంతమైన నమూనాగా (మోడల్)...

CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!

సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం...

Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..

Suvendu Adhikari: బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్...