16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

Date:

బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడిన రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 1.10 కోట్లకు అమ్ముడు కావడంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది తన దూకుడును చాటుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో బౌలర్లపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిణతి, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుండటంతో అతడిని భారత క్రికెట్ తదుపరి సూపర్‌స్టార్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.

బిసిసిఐకి వైభవ్ ఎంపిక ఎందుకు సవాలుగా మారింది..?

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం 13 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడంపై బీసీసీఐ తీవ్రంగా యోచిస్తోంది. అయితే.. ఈ ఎంపిక సెలక్టర్లకు ఒక పెద్ద సవాల్‌గా మారింది.

ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అగ్రశ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటే వీరిలో ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఒకవేళ యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వైభవ్‌ను బరిలోకి దించితే.. సీనియర్ ఆటగాళ్ల స్థానాల విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read:Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

మరోవైపు, కెప్టెన్సీ విషయంలోనూ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించని సూర్యకుమార్ యాదవ్‌ను ఈ పర్యటనకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. జట్టు పగ్గాలను అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్‌లకు అప్పగించే వీలుంది. ఐర్లాండ్ చిన్న జట్టు కావడంతో ప్రయోగాలకు ఇది సరైన సమయమని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం కల్పిస్తూనే, జట్టులో సమతుల్యతను కాపాడటం మేనేజ్‌మెంట్‌కు ఇప్పుడు కత్తిమీద సాము వంటిదే. ఈ పర్యటన ద్వారా భారత టీ20 భవిష్యత్తుపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బలు కొనసాగుతుండగా, పంజాబ్ కింగ్స్...

Unknown Gunmen: పిట్టల్లా రాలుతున్న ఉగ్రవాదులు.. పాకిస్తాన్‌లో ‘‘ధురంధరులు’’..

Unknown Gunmen: పాకిస్తాన్‌లో ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ సంచలనం సృష్టిస్తున్నారు. లష్కరే తోయిబా,...

LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన వినియోగదారులకు, ఏజెంట్లకు అత్యాధునిక...

TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ...