18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..

Date:

V.D. Satheesan: కేరళంలో దశాబ్దం కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.డి. సతీశన్ సోమవారం కేరళం 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. సతీశన్, 20 మంది సభ్యుల మంత్రిమండలితో పదవీ స్వీకార, రహస్య విధి నిర్వహణ ప్రమాణాలు చేయించారు.

ఈ అట్టహాసమైన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నాయకులు సైతం విచ్చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ను ఓడించి కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో వేలాది మంది యూడీఎఫ్ శ్రేణులు, మద్దతుదారులు మైదానానికి తరలివచ్చారు. ప్రజాస్వామ్య బదిలీ ప్రక్రియకు అద్దం పడుతూ, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోనున్న మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సైతం వేదికపై కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరుకావడం విశేషం.

ఇక ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, ఎల్‌డీఎఫ్ పదేళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించింది. గత ఐదేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా, దూకుడుగా నిలదీసిన వి.డి. సతీశన్‌కే ఈ అద్భుత విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ దక్కింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి రాష్ట్ర సీనియర్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం, సతీశన్‌ను కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి సతీశన్‌తో పాటు ఆయన 20 మంది సభ్యుల మంత్రిమండలి కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసింది. కేరళం చరిత్రలో దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఒకే రోజు, ఒకే వేదికపై పూర్తి స్థాయి క్యాబినెట్ ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొత్త క్యాబినెట్ కేరళం రాజకీయాల్లో “తరాల మార్పును” (generational shift) ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 21 మంది ఉన్న ఈ మంత్రివర్గంలో 14 మంది సరికొత్త ముఖాలు (తొలిసారి మంత్రులైన వారు) కావడం గమనార్హం.

ఈ క్యాబినెట్‌లో యూడీఎఫ్ కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలకు కూడా సముచిత స్థానం దక్కింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కు ఐదు మంత్రి పదవులు దక్కగా, కేరళం కాంగ్రెస్ వర్గాలు, ఇతర మిత్రపక్షాలకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. తాజా నివేదికల ప్రకారం.. ముఖ్యమంత్రి సతీశన్ తన వద్దే ఆర్థిక, రేవుల (పోర్ట్స్) వంటి కీలక శాఖలను ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు హోం శాఖతో పాటు విజిలెన్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూ శాఖ దక్కవచ్చని సమాచారం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక

AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత...

Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి

Greater Noida: గ్రేటర్ నోయిడాలోని జలపుర గ్రామంలో ఓ వివాహిత మరణం...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* IPL 2026: ఇవాళ CSK వర్సెస్‌ SRH.. చెన్నై వేదికగా...