18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..

Date:

UP News: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భర్తను భార్య, ఆమె లవర్ కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని పాత్రల వ్యాపారిగా గుర్తించారు. ఈ కేసులో భార్య , ఆమె లవర్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. 45 ఏళ్ల ఉమాశంకర్ కౌశల్ అలియాస్ గుడ్డు మృతదేహం గురువారం ఉదయం లాల్‌గంజ్ ప్రాంతంలోని శీతల్‌మౌ కాలువ సమీపంలో కనిపించింది. ఈ కేసులో భార్య సుమన్ దేవి, షహన్ షా, విశాల్ శుక్లా, అవినాశ్ తివారీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉమాశంకర్ బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం ఉదయం కాలువలో మృతదేహంగా కనిపించాడు. మృతుడి ఛాతి, తలపై ఇటుకలతో కొట్టి చంపినట్లు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఉమాశంకర్ సోదరుడు ఈ హత్యలో భార్య సుమన్ దేవి, షహన్ షా ప్రమేయం ఉందని ఆరోపించడంతో కేసు విచారణ వేగవంతమైంది. సుమన్ దేవి, షహన్ షా మధ్య వివాహేతర సంబంధం ఉందని దీనిని వ్యతిరేకించడంతోనే భర్త ఉమాశంకర్ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యలో మరో ఇద్దరు కూడా సహకరించినట్లు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?

Kolkata: పండగ వేళ పశ్చిమ బెంగాల్‌‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని...

CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..

CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా...

CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

CM Chandrababu: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు

MP Mithun Reddy: పుంగనూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో...