24
November, 2026

A News 365Times Venture

24
Tuesday
November, 2026

A News 365Times Venture

UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!

Date:

UP Crime: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిరాకరించినందుకు ప్రియుడితో కలిసి ఓ కుమార్తె కన్నతల్లినే హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు ఇంటి నుంచి సంతకు వెళ్లిన తర్వాత ఇంట్లో తల్లి ఒక్కరే ఉన్నారని ప్రియుడిని పిలిచి ఇద్దరూ కలిసి హత్య చేశారు.

అక్క భర్తతో ప్రేమ.. తల్లి అభ్యంతరం..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లా కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్‌పూర్ గిర్సా గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాజమతి నవంబర్ 20న రాత్రి ఇంట్లో హత్యకు గురైంది. ఆమె చిన్న కుమార్తె శైలాజా దేవి అలియాస్ విద్యకు, ఆమె అక్క భర్త దిలీప్ కుమార్ సరోజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, ఈ సంబంధాన్ని తల్లి రాజమతి తీవ్రంగా వ్యతిరేకించింది. దీతో తల్లిని అడ్డు తొలగించాలని శైలజ, దిలీప్ కలిసి ఆమెను హత్య చేశారు.

ఇంట్లో కుటుంబ సభ్యులు సమీపంలో సంతకు వెళ్లిన సమయంలో రాజమతి ఒంటరిగా ఉందని ప్రియుడు దిలీప్‌కు శైలజ కబురు పంపింది. సమాచారం తెలుసుకున్న దిలీప్ ఇంటికి చేరుకుని, ఇటుకతో రాజమతి తలపై పలుమార్లు కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య తర్వాత ఎవరికీ అనునమానం రాకుండా నిందితులు ఉపయోగించిన ఇటుకను చెరువు గట్టు వద్ద పారేశారు. రక్తపు మరకలు అంటిన తన దుస్తులు, బూట్లను శుభ్రం చేసుకుని సంతకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సీసీటీవీలో చిక్కిన నిందితులు..

నవంబర్ 20న రాత్రి పోలీసులకు హత్య సమాచారం అందింది. డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీమ్‌లో ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. ఈ కేసు కోసం మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ నిఘా, సీసీటీవీ ఫుటేజ్, స్థానికులను విచారించడం ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులు దిలీప్, శైలజనను అరెస్ట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..

Jensen Huang: ప్రపంచ ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)...

CM Revanth Reddy : భూసేకరణ లెక్కలతో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్.. పాలమూరు–రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జలాలు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ...

Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Donald Trump:  అమెరికా చిప్‌ తయారీ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు...

Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్

తెలంగాణలో ‘గోల్డ్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్...