30
June, 2026

A News 365Times Venture

30
Tuesday
June, 2026

A News 365Times Venture

Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Date:

Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది.

READ ALSO: Police Act: తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ

253 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్‌ (38) పరుగులు నమోదు చేశారు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్‌, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది.

47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఉన్న టీమిండియాను వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలకమైన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఆయుష్‌ మాత్రే స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. ఆర్‌.ఎస్.అంబరీష్‌ (29), విహాన్ మల్హోత్రా (21), అభిజ్ఞాన్ కుందు (16), ఆరోన్ జార్జ్ (16) పరుగులు నమోదు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఖిలాన్ పటేల్ (21; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ ఈ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మహ్మద్ సయ్యమ్ 2, అహ్మద్ హుస్సేన్, మోమిన్, అలీ రజా, అలీ హసన్ తలో వికెట్లు కూల్చారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా -ఇంగ్లాండ్, ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్‌లో భారత్ – అఫ్గానిస్థాన్ బరిలోకి దిగబోతున్నాయి.

READ ALSO: 2026 T20 World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఈసారి వరల్డ్ కప్‌లో భారత్-పాక్ సమరం ఉండదు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..

ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు...

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే...

Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హీట్‌ పుట్టింది.. డీఎంకే...