30
June, 2026

A News 365Times Venture

30
Tuesday
June, 2026

A News 365Times Venture

T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ వీరే!

Date:

T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ ఎవరో తెలుసా.. ఈ రికార్డులో ముందు వరుసలో క్రికెట్ ప్రేమికులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ ఉన్నాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్సింగ్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్ మామూలుగా గర్జించలేదు. ఏకంగా 10 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తంగా 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ సెంచరీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక ఇండియన్ క్రికెటర్ చేసిన వేగవంతమైన సెంచరీగా రికార్డ్ సృష్టించింది.

READ ALSO: February Born Secrets : వీరికి ఉండే ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా.?

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న క్రికెటర్.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. మైదానంలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను షేక్ చేస్తున్న అభిషేక్ శర్మఇంగ్లాండ్‌పై ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరుఫున T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. ఈ యువ ఓపెనర్ 2025లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. అతను ఈ మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.

ఈ జాబితాలో మూడవ స్థానంలో సంజు శాంసన్ ఉన్నాడు. నిజానికి ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో అవస్థలు పడుతున్న సంజు శాంసన్ గతంలో సూపర్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ బ్యాటర్ 2024లో చేసిన అద్భుతమైన ప్రదర్శన ఎప్పటికీ టీమిండియా అభిమానుల మదిలో నిలిచే ఉంటుంది. ఆ ఏడాది శాంసన్ అతను T20 ఫార్మాట్‌లో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఆ టైంలో సంజు శాంసన్ హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది ఈ ఫార్మాట్‌లో ఒక భారతీయుడు చేసిన మూడవ వేగవంతమైన సెంచరీ. శాంసన్ ఆ ఇన్సింగ్‌లో 47 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 111 పరుగులు నమోదు చేశాడు.

T20 అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగవ వేగవంతమైన సెంచరీ రికార్డును కలిగి ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 41 బంతుల్లో సెంచరీ నమోదు చేసి ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఈ ఇన్సింగ్స్‌లో తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. ఐదవ వ్యక్తి.. ఇషాన్ కిషన్.

వాస్తవానికి ఇషాన్ కిషాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో చిరస్మరణీయమైన ఇన్సింగ్స్‌తో పునరాగమనం చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో శాశ్వత స్థానం కోసం తన సూపర్ ఇన్సింగ్స్‌తో సెలక్టర్లను సవాల్ చేశాడు. 2025లో త్రివేండ్రంలో న్యూజిలాండ్‌తో జరిగిన T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐదవ వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఇన్సింగ్స్‌లో ఇషాన్ 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.

READ ALSO: BCCI Budget 2026-27: టీం ఇండియా బడ్జెట్.. బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు ఎలా వస్తాయంటే?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే...

Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హీట్‌ పుట్టింది.. డీఎంకే...

Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ స్టార్‌, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ...

Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం

Cooking Tips: ఇంట్లో పరాటాలు, పూరీలు లేదా ఇతర వంటకాలతో పాటు...