29
April, 2026

A News 365Times Venture

29
Wednesday
April, 2026

A News 365Times Venture

UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

Date:

UAE: ఇరాన్ యుద్ధం అరబ్ దేశాల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్+ నుండి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాకేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న తరుణంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.

తమ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. యూఏఈ చాలా కాలంగా ఈ రెండు కూటముల్లో భాగస్వామిగా ఉందని, అయితే ప్రపంచానికి భవిష్యత్తులో మరింత ఇంధన అవసరమవుతుందని, డిమాండ్ పెరుగుతుందని ఇంధన శాఖ మంత్రి సుహైల్ అల్ మజ్రూఈ అన్నారు. ఈ విధాన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన నిర్ణయమని యూఏఈయ భావిస్తుందని ఆయన చెప్పారు.

సౌదీ అరేబియాకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తోంది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం చమురు ఎగుమతి చేసే కూటమి, దాని వాస్తవ నాయకుడిగా భావించే సౌదీ అరేబియాకు అతిపెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ఆ కూటమిని గందరగోళానికి గురి చేసి, దాన్ని బలహీనపరచవచ్చు. భౌగోళిక రాజకీయాలు, ఉత్పత్తి కోటాల వరకు ఒపెక్‌ దేశాల్లో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ, ఎప్పుడూ విభేదాలు బయటపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయా దేశాల మధ్య దూరం పెరుగుతోంది.

ట్రంప్‌కు ఆనందమే:

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టొచ్చు. ఒపెక్ చమురు ధరల్ని పెంచి ప్రపంచాన్ని దోపిడీ చేస్తోందని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా సైనిక మద్దతును ట్రంప్ చమురు ధరలతో ముడిపెట్టారు. అమెరికా ఒపెక్ దేశాలను రక్షిస్తూ, అదే సమయంలో అధిక ధరల విధించడం ద్వారా లాభం పొందుతుందని ఆయన వాదిస్తున్నారు. ఇటీవల, ఇరాన్ యుద్ధంలో ఇరాన్ తమపై దాడులు చేస్తున్న ఏ ఇతర అరబ్ దేశం కూడా తమకు పెద్దగా సహాయం చేయలేదని యూఏఈ ఆరోపించింది.

ఒపెక్ అంటే ఏమిటి.?

ఒపెక్ ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల కూటమి. 1960లో ఈ కూటమి ఏర్పడింది. చమురు ధరలు, విధానాలపై ఉత్పత్తి ఈ దేశాల నియంత్రణలో ఉంటుంది. మే 1 నుంచి ఈ కూటమిన నుంచి యూఏఈ వైదొలగడంతో ఈ సమూహలో 11 దేశాలు మాత్రమే మిగులుతున్నాయి. అవి అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

Janasena Party: జనసేన పార్టీ కర్ణాటక రాష్ట్రంలో తన విస్తరణకు శ్రీకారం...

Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

Telangana DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్...

Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

Petrol Bunks Rush: ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా...

S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

S-400 air defence system: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్...