26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు

Date:

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ఉపాధి లేమి ఏర్పడకుండా ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఈ మేరకు కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు. కష్టకాలంలో గిరిజన కుటుంబాలకు అండగా నిలిచి, ఉపాధి కల్పించడం ద్వారా వలసలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

కొత్త జాబ్ కార్డుల జారీ.. కుటుంబ సభ్యులందరికీ చోటు

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించి వెంటనే కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఈ జాబ్ కార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ‘విశ్వకర్మ-గ్రామీణ ఉపాధి హామీ’ (VB-G RAM G) పథకం కింద అర్హులైన ప్రతి ఆదివాసీ, గిరిజన కుటుంబానికి ఏడాదికి 125 రోజులపాటు ఉపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు.. పకడ్బందీ అమలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియతో పాటు, గిరిజనులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. కరువు పరిస్థితులు ప్రభావం చూపకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలకు పెద్దఎత్తున ఆర్థిక భరోసా లభించనుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?

Viral Video: సోషల్ మీడియాలో ఓ నవజాత శిశువుకు సంబంధించిన వీడియో...

Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!

Bengaluru IT Jobs: కర్ణాటకలో స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలకు దూరంగా...

Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..

Kharge Controversy:  కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో...