9
August, 2026

A News 365Times Venture

9
Sunday
August, 2026

A News 365Times Venture

Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్ స్వాధీనం..!

Date:

Trainee IPS Case: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో మహిళతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

అశోక్ నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గదిలో నుంచి రెండు ప్రేమలేఖలు, ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, కేసు దర్యాప్తులో భాగంగా విశ్లేషించనున్నారు.

ఈ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయిన అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళతో అతడు సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అయితే విడాకుల తర్వాత తనతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని ఉదయ్ చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, మరో మహిళ కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై ఇద్దరూ ఒకరితో ఒకరు తమ అనుభవాలు, బాధలను పంచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడనే ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్

Kiren Rijiju-Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటనపై...

Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం

Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్‌తో తుఫానులా దూసుకొచ్చాడు...

AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ...

Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ వేగవంతమైన...