23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్‌ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌..!

Date:

Traffic Jam: దసరా పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు మళ్లీ రాజధాని బాట పట్టారు. పల్లెల్లో వేడుకలు ఘనంగా ముగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారులు జనసందోహంతో, వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పునఃప్రారంభం కానుండటంతో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి నగరానికి తరలివస్తున్నారు. దీంతో శివారు రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), వరంగల్–హైదరాబాద్ (NH-163) మార్గాల్లో వాహనాలు చీమల దండులా బారులు తీరాయి. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, బీబీనగర్ సమీపంలోని రాయగిరి, గూడూరు టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. చౌటుప్పల్ సమీపంలో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీలక జంక్షన్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు.చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వైపు సాఫీగా మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండేందుకు ఫాస్టాగ్‌ (FASTag) స్కానర్లను ముందస్తుగానే తనిఖీ చేసి, అదనపు సిబ్బందితో హ్యాండ్‌హెల్డ్ మెషీన్ల ద్వారా ఫాస్ట్‌గా టోల్ రుసుము వసూలు చేసేలా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వాహనాలు, అంబులెన్సుల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించారు.

మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రాకతో రద్దీగా మారాయి. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయి నగరానికి చేరుకుంటున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వాహనాల రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రధాన మార్గాల్లో గస్తీ ముమ్మరం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!

SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన...

CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..

Chandrababu Naidu: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు,...

Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.

Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశీ యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ...

SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!

SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో...