23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!

Date:

AP SEC: రాష్ట్రంలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల (2026) నామినేషన్ల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు పోలీస్ శాఖ నుంచి ఎన్‌వోసీ (No Objection Certificate) గానీ, ఇతర శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు (No Dues Certificate) గానీ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో (SHO)ల నుంచి ఎన్‌వోసీలు, అలాగే నో డ్యూస్ పత్రాలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారులు (ROs), ఎన్నికల అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు రాజకీయ పార్టీలు, పలువురు అభ్యర్థుల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఏర్పడిన గందరగోళాన్ని నివారించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (రిటైర్డ్ ఐఏఎస్) అధికారిక సర్క్యులర్ (నెం. 1098/SEC-F1/2026) జారీ చేశారు.

ఇందులో భాగంగా.. స్థానిక సంస్థల ఎన్నికల చట్టాల్లోగానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లోగానీ పోలీస్ శాఖ ఎన్‌వోసీ లేదా ఇతర విభాగాల నో డ్యూస్ సర్టిఫికెట్లు సమర్పించాలనే నిబంధన ఎక్కడా లేదని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే కేవలం ఎన్‌వోసీ లేదా నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించలేదనే కారణంతో ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించవద్దని ఎన్నికల అధికారులను ఆదేశించింది.

అంతేకాకుండా అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం అవసరమైన మిగిలిన అన్ని పత్రాలను సమర్పిస్తే సరిపోతుందని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన (Scrutiny) ప్రక్రియల్లో గతంలో కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రమే కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల ప్రతులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, రిటర్నింగ్ అధికారులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం నిమిత్తం పంపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!

SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన...

CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..

Chandrababu Naidu: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు,...

Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.

Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశీ యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ...

SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!

SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో...