20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..

Date:

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నియమావళి ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది.

ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావడం వల్ల వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 సహా పలు కీలక ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు అనేక శాఖల్లో సరైన స్థాయిలో నియామకాలు జరగకపోవడంతో అప్పట్లో ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. ఆ ఉత్తర్వుల గడువు ఇటీవల ముగియడంతో మరోసారి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్ష నిర్వహించి తాజా నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండగా, తాజా సడలింపుతో ఇప్పుడు 44 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు కూడా అర్హత పరీక్షలు రాసే అవకాశం పొందనున్నారు. దీని ద్వారా చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగాయి. కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముందు అభ్యర్థుల వయోపరిమితిపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు

Medak: ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర ప్రభావం...

AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర...

Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |

కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకు ముందు స్థితికి చేరనేలేదు....

RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్...