3
November, 2026

A News 365Times Venture

3
Tuesday
November, 2026

A News 365Times Venture

Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్‌ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..

Date:

Tamil Nadu: తమిళనాడు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుండటంపై సీఎం విజయ్ సర్కార్‌పై డీఎంకే, అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెట్టుబడుల్ని ఆకర్షించే సామర్థ్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మందగించాయని అన్నామలై అన్నారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1614 కోట్ల దక్షిణ కొరియా పెట్టుబుడులు ఏపీకి తరలిపోయాయని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.

మాజీ బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఎక్స్‌లో విజయ్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో స్వల్ప వృద్ధి తర్వాత మే నుంచి సెప్టెంబర్ వరకు తమిళనాడు జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే తగ్గినట్లు గణాంకాలతో సహా వివరించారు. సెప్టెంబర్‌లో 5 శాతం క్షీణతతో రూ. 10,188 కోట్లకు చేరాయని, అక్టోబర్ లో మాత్రం 3 శాతం వృద్ధితో రూ.11,661 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది.

డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కూడా విజయ్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. తమిళనాడు జీఎస్టీ వృద్ధి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1614 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లాయని విమర్శించారు.

హ్యుందాయ్, కియా సంస్థలకు ఆటోమొబైల్ విడిభాగాలను సరఫరా చేసే మూడు దక్షిణ కొరియా కంపెనీలు హ్వాషిన్, సియోన్, ఐవామెట్ ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అనంతపురంతో ఈ సంస్థలు రూ. 1614 కోట్ల పెట్టుబడుల ద్వారా 1418 ఉద్యోగాలు కల్పించనున్నట్లు అంచనా వేశారు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..

దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్...

AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల...

TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో నిర్వహించిన సభలు, పాదయాత్రల వల్ల...

OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?

OTR: పోలింగ్‌ పూర్తయిపోయి అట్టా…. బ్యాలెట్‌ బాక్స్‌లకు సీల్‌ వేశారో లేదో…....