7
May, 2026

A News 365Times Venture

7
Thursday
May, 2026

A News 365Times Venture

Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

Date:

Suvendu Adhikari PA Murder: ఎన్నికల అనంతరం బెంగాల్‌లో రక్తం పారుతూనే ఉంది. ప్రతీకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్ బీజేపీ నేత, సీఎం రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య సంచలనంగా మారింది. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నప్పటికీ, ముగ్గురు స్థానిక నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

అనేక సంవత్సరాలుగా సువేందు అధికారి పీఏగా చంద్రనాథ్ రథ్ పనిచేస్తున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. హత్యకు ముందు దుండగులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి, తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. రథ్ స్కార్పియోను రెండు వాహనాలు వెంబడించాయి, వీటిలో ఒకటి WB74AX2270 రిజిస్ట్రేషన్ నంబరు గల వెండి రంగు శాంట్రో కారు కాగా, మరొకటి మోటార్‌సైకిల్. స్కార్పియోను ఓవర్ టేక్ చేసిన శాంట్రో స్కార్పియో వేగాన్ని తగ్గించేలా చేసింది. కొద్ది క్షణాలకే బైక్‌పై వచ్చిన దుండగులు అతి దగ్గర నుంచి రథ్‌పై కాల్పులు జరిపారు.

Read Also: Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

ఈ దాడిలో రథ్ పొట్ట, ఛాతీ, తల భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. దాడికి ఉపయోగించిన బైక్‌కు నెంబర్ ప్లేట్ లేదని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి ఆస్ట్రియాలో జరిగిన గ్లాస్ పిస్టల్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. కారు నెంబర్ ప్లేట్ మార్చినట్లు, ఇంజన్ ఛాసిస్ నెంబర్ లేకుండా చేసినట్లు తెలుస్తోంది.

ఈ హత్యపై బీజేపీ, టీఎంసీపై విరుచుకుపడుతోంది. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ హత్య చేయించినట్లు బీజేపీ ఆరోపించింది. తాము అధికారంలో లేకున్నా హత్యలు జరుగుతాయనే సందేశాన్ని పంపాలని ఇలా చేశారని బీజేపీ నేత అర్జున్ సింగ్ ఆరోపించారు. మరోవైపు టీఎంసీ ఈ హత్యను ఖండించింది. తమపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిగాలని డిమాండ్ చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

Suvendu Adhikari: బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హత్యా రాజకీయాలు ఆగడం లేదు....

Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది....

Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

ఆస్ట్రేలియా టెస్ట్ , వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో అరుదైన...

Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు...