2
May, 2026

A News 365Times Venture

2
Saturday
May, 2026

A News 365Times Venture

Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ

Date:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపులో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను నియమించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఝలక్ తగిలింది. శనివారం సెలవు దినం అయినప్పటికీ అత్యవసర విచారణగా టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనల తర్వాత సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్‌లు పి.ఎస్. నరసింహ, జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు టీఎంసీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటింగ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలని ఏమీ రూల్ లేదని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధం కాదని పేర్కొంది. ఈ విషయంలో కొత్త ఉత్తర్వులు ఏమీ అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న టీఎంసీ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.

వివాదం ఇదే..
ఏప్రిల్ 30న ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కనీసం ఒక సూపర్‌వైజర్ లేదా అసిస్టెంట్ కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ (PSU) నుంచి ఉండాలని ఎన్నికల సంఘం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఇదే రాజకీయ దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ ప్రభావంతో పనిచేయవచ్చని టీఎంసీ ఆరోపించింది. దీంతో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ తిరస్కరించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికల సంఘం ఎవరినైనా నియమించుకోవచ్చని స్పష్టం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!

Nitin Gadkari: “ఎవడైనా కులం గురించి మాట్లాడితే వాడికి గట్టిగా తన్నులు...

AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన...

Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?

రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం....