Supreme Court: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ వినియోగంపై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జనసమూహాన్ని నియంత్రించే సమయంలో పోలీసుల బలప్రయోగం ఎలా ఉండాలనే అంశంపై అమలులో ఉన్న గ్రేడెడ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ (Graded Use of Force) స్టాండింగ్ ఆర్డర్‌ను కోర్టు ముందు సమర్పించాలని ఆదేశించింది. వాడటానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పెల్లెట్ గన్స్‌నూ పూర్తిగా నిషేధించలేమని చెప్పింది.
మరోవైపు పిటిసనర్ల తరుపుణ న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల్లో నిరసనల సమయంలో మెటాలిక్ పెల్లెట్ గన్స్ వినియోగానికి అనుమతి లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అలాంటి ఆయుధాలు వాడకంపై పోలీసుల చర్యలపై విచారణ కోరారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, క్రౌడ్ కంట్రోల్‌లో బలప్రయోగానికి సంబంధించిన అధికారికి స్టాండింగ్ ఆర్డర్‌ను రికార్డ్‌లో ఉంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని చెప్పింది. ఇదే సమయంలో పోలీసులు వాడిన మందుగుండు సామాగ్రికి సంబంధించిన వివరాలు భద్రపరచాలని ఆదేశించింది.
పెల్లెట్ గన్స్ కాల్పుల్లో గాయపడిన వారికి పూర్తి న్యాయ సహాయం అందించాలని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను ఆదేశించింది. ఈ కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు సమర్పించే స్టాండింగ్ ఆర్డర్, పెల్లెట్ గన్ వినియోగంపై కోర్టు చేపట్టే పరిశీలన కీలకంగా మారే అవకాశం ఉంది.




